అమృత్‌స‌ర్‌: ఓవైపు కరోనావైరస్ వేధిస్తున్న ప్రస్తుత తరుణంలోనే మరోవైపు కల్తీ మ‌ద్యం ( spurious liquor) సేవించి 48 గంట‌ల వ్య‌వ‌ధిలోనే 21 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు పంజాబ్‌లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. అమృత్‌స‌ర్‌, గురుదాస్‌పూర్‌, తార‌న్ త‌ర‌న్ ప్రాంతాల్లో ఇంకొందరు అస్వ‌స్థ‌త‌కు గురై ఆస్ప‌త్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. జూన్ 29, 30 తేదీలలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. కల్తీ మద్యం సేవించి 21 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ( CM Amarinder Singh) తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తంచేశారు. 21 మంది మృతి ఘటనలపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు సీఎం అమరిందర్ సింగ్ తెలిపారు. Also read: Twitter hacking: ట్విటర్ హ్యాకింగ్ ఎలా జరిగిందంటే..


ఈ ఘటనలపై సీఎం అమరీందర్ సింగ్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ఈ ఘ‌ట‌న‌ల‌పై జలంధర్ డివిజనల్ కమిషనర్ దర్యాప్తు చేపట్టారని, బాధ్యులైన వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తామని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.  Also read: Corona Patient Missing: పరారీలో 42 మంది కరోనా పేషెంట్లు.. అధికారుల ఉరుకులు పరుగులు