Bihar spurious liquor: బిహార్‌లో దీపావళి పండుగ(Diwali Festival) వేడుకలలో విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 24 మంది మృతి చెందారు. దీంతో గోపాల్‌గంజ్‌, వెస్ట్ చంపార‌న్ జిల్లాల్లో విషాదం నెల‌కొందిమరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కల్తీ మద్యం కారణంగా వెస్ట్ చంపారన్ జిల్లా(West Champaran)లోని తెల్హువా(Telhua) గ్రామంలో ఎనిమిది మంది మరణించగా.. గోపాల్‌గంజ్ జిల్లా(Gopalganj District) కుషాహర్‌, మహ్మద్‌పూర్‌లో 16 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా న‌కిలీ మ‌ద్యం(spurious liquor) తాగి ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు బీహార్‌ అధికారులు పేర్కొన్నారు. మృత‌దేహాల‌కు పోస్టుమార్టం రిపోర్టు అనంతరం మ‌ర‌ణాల‌కు గ‌ల కారణం తెలిసే అవ‌కాశం ఉంద‌ని గోపాల్‌గంజ్ పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో దాదాపు 20 మంది గిరిజనులే ఉన్నారని పోలీసులు తెలిపారు. 


Road Accident: Bus Fall into Ravine: పండుగ రోజు విషాదం.. లోయలో పడిపోయిన బస్సు.. 22 మంది మృతి


స్థానికంగా త‌యారు చేసిన మ‌ద్యం సేవించడం కారణంగానే వీరు చ‌నిపోయిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. అయితే.. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మద్యం తాగడంతోనే వారంతా మరణించినట్లు బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటనపై బిహార్‌ సీఎం నితిష్‌ కుమార్‌(Chief Minister Nitish Kumar) తీవ్ర ఆవేదన  వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


ఈ ఘటన అనంతరం బీహార్ మంత్రి జ‌న‌క్ రామ్.. గోపాల్‌గంజ్ జిల్లా వెళ్లి ప‌రిస్థితిని స‌మీక్షించారు. పలువురు మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. కాగా.. నితీష్ కుమార్ బీహార్‌(Bihar)లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మద్యపాన నిషేధం(ban on alcohol) విధించిన సంగ‌తి తెలిసిందే. ఇదిలాఉంటే.. ఈ ఏడాది న‌కిలీ మ‌ద్యం తాగి ఇప్పటివరకు 70 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి