Covid19 Patients Dies due to oxygen shortage: దేశంలో కరోనా వ్యాప్తి పరిస్థితులు మరో సంక్షోభానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో నమోదయ్యే కరోనా కేసులు ప్రపంచంలో అత్యధిక పాజిటివ్ కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతున్న నేపథ్యంలో ముఖ్యంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరు రోజుల లాక్‌డౌన్ విధించారు. ఢిల్లీలో పలు ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా బాధితులు చనిపోతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో కేవలం 24 గంటల వ్యవధిలో 25 మంది కరోనా బాధితులు మరణించారు. ఆక్సిజన్ కొరత కారణంగా మరో 60 మంది కరోనా బాధితుల ప్రాణాలు ఆపదలో ఉన్నాయని శుక్రవారం ఉదయం రిపోర్ట్ వచ్చింది. మరికొందరు పేషెంట్లు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సర్ గంగారామ్ ఆసుపత్రిలో వెంటిలేటర్లు, BiPAP మెషీన్లు శుక్రవారం ఉదయం సరిగా పనిచేయడం లేదని సమాచారం. తమకు ఆక్సిజన్ కొరత(Oxygen Levels) ఉందని, పలు ఆసుపత్రులలో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. 


Also Read: Corona Cases: తెలంగాణలో భారీగా పెరుగుతున్న కోవిడ్19 మరణాలు, తాజాగా 29 మంది మృతి



ఆక్సిజన్ కొరత కారణంగా ఒకే ఆసుపత్రిలో 24 గంటల వ్యవధిలో 25 మంది కరోనా పేషెంట్లు చనిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. నిన్న రాత్రి కేవలం నాలుగైదు గంటల పాటు ఆక్సిజన్ నిల్వలు మాత్రమే ఉన్నాయని వెంటనే సరఫరా చేయాలని కోరినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం మరో 500 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరత, కరోనా వ్యాక్సిన్ల(Covid-19 Vaccine) కొరత అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు.


Also Read: New COVID-19 Guidelines: మే 1 నుంచి మూడో దశలో కరోనా వ్యాక్సినేషన్, కేంద్రం మార్గదర్శకాలివే


గత నాలుగైదు రోజులుగా ఆక్సిజన్ శాచ్యురేషన్ లెవెల్స్ పడిపోవడంతో కరోనా బాధితులలో అధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఆరు ప్రైవేట్ ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత ఉందని తమకు వెంటనే ఆక్సిజన్ సిలిండర్లు పంపించాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, కేంద్ర హోంశాఖ మంత్రి హర్ష వర్ధన్‌కు గురువారం సాయంత్రం లేఖ రాశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook