ఢిల్లీని వణికిస్తోన్న కరోనా.. ఒకే రోజు 25 కరోనా కేసులు గుర్తింపు
దేశ రాజధాని ఢిల్లీలో నేడు ఒక్క రోజే కొత్తగా 25 కరోనావైరస్ పాజిటివ్ కేసులను (Coronavirus positive cases in Delhi) గుర్తించినట్టు ఢిల్లీ సర్కార్ (Delhi govt) ప్రకటించింది. కరోనావైరస్‌ను కనుగొన్నప్పటి నుండి ఢిల్లీలో ఒకే రోజు ఇంత భారీ సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారి అని ఆరోగ్య శాఖ అధికారులు (Health dept) తెలిపారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నేడు ఒక్క రోజే కొత్తగా 25 కరోనావైరస్ పాజిటివ్ కేసులను (Coronavirus positive cases in Delhi) గుర్తించినట్టు ఢిల్లీ సర్కార్ (Delhi govt) ప్రకటించింది. కరోనావైరస్‌ను కనుగొన్నప్పటి నుండి ఢిల్లీలో ఒకే రోజు ఇంత భారీ సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారి అని ఆరోగ్య శాఖ అధికారులు (Health dept) తెలిపారు. నేటి సంఖ్యతో కలిపి ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య మొత్తం 97కి చేరింది. ఇక దేశం మొత్తంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (COVID cases in India) 1251కి చేరగా.. కరోనావైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య 32కి చేరింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 106 కరోనావైరస్ పాజిటివ్ కేసులను గుర్తించగా.. ఆరుగురు కరోనాతో చనిపోయినట్టుగా నివేదికలు అందాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
Read also : అసలు నిజం దాచిన కంపెనీ.. 17 మందికి కరోనా.. సంస్థపై కేసు నమోదు
ఇదిలావుంటే, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జవహార్ లాల్ నెహ్రూ స్టేడియం (JLN Stadium complex) సముదాయాన్ని కోవిడ్-19 క్వారంటైన్ అవసరాల కోసం వినియోగించుకోవడానికి అనుమతిస్తూ సర్కార్ ఆదేశాలు జారీచేసింది.
పశ్చిమ బెంగాల్‌లో నేడు మరో ఇద్దరికి కరోనావైరస్ పాజిటివ్ అని గుర్తించినట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో వెస్ట్ బెంగాల్‌లో ఇప్పటివరకు కరోనావైరస్ పాజిటివ్ సోకిన వారి సంఖ్య 22కి చేరినట్టయింది.
Read also : కరోనా ఎఫెక్ట్: వాట్సాప్ వినియోగదారులకు షాక్
కర్ణాటకలో కరోనావైరస్ అనుమానితులుగా ఉంటూ హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారిని ప్రతీ గంటకు ఒకసారి సెల్ఫీ తీసుకుని సంబంధిత అధికారులకు పంపించాల్సిందిగా అక్కడి సర్కార్ ఆదేశాలు జారీచేసింది.
కరోనావైరస్‌ని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై నీతి ఆయోగ్ స్పందిస్తూ... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని, తగినంత నిద్ర పోవాల్సిందిగా సూచించింది. సోషల్ డిస్టన్సింగ్ పాటిస్తూనే రోజూ క్రమం తప్పకుండా వ్యాయమం చేస్తూ శరీరాన్ని ధృడంగా ఉంచుకోవాల్సిందిగా నీతి ఆయోగ్ సజెస్ట్ చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..