భారత్‌లో రెండోసారి పొడిగించిన లాక్‌డౌన్ నేటితో మొదలైంది. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లలో కొన్నింటికి అనుమతులు లభించాయి. దీంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. కానీ ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. నేటికీ దేశంలో కరోనా పాజిటివ్ కసులు సంఖ్య పెరిగిపోతోంది. లాక్‌డౌన్‌లో మిల్కీ ‘బ్యూటీ’ Photos


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడిచిన 24 గంటల్లో తాజాగా 2,553 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 72 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,533కి చేరుకోగా, ఇప్పటివరకూ 1,373 మంది కరోనా కాటుకు బలైపోయారు. చికిత్స అనంతరం 11,707 మంది కోలుకున్నారు. బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!


భారత్‌లో రికవరీ రేటు 27.52 శాతానికి పెరిగిందని  కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. కరోనా సోకినా మరణాల రేటు అతి తక్కువ శాతం (3.2) భారత్‌లోనే నమోదైందని కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. బిగ్‌బాస్ 4 సెలబ్రిటీల జాబితా లీక్


మహారాష్ట్రలో 521 మరణాలు సంభవించగా, కేవలం ముంబై నగరంలోనే 343 మంది మరణించారు. మహారాష్ట్రంలో ఇప్పటివరకూ 12,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 427 కోవిడ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 4,549కి చేరింది. మే 4 ఉదయం 9 గంటల వరకు దేశంలో 11,07,233 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా! 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!