బిగ్‌బాస్ 4 సెలబ్రిటీల జాబితా లీక్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుందని, నాలుగో సీజన్ కంటెస్టెంట్ల ఎంపిక కూడా జరుగుతోందని ప్రచారం జరుగుతోంది.

Last Updated : May 4, 2020, 09:07 AM IST
బిగ్‌బాస్ 4 సెలబ్రిటీల జాబితా లీక్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

కరోనా వైరస్ ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ తీవ్ర ప్రాణ నష్టాన్ని కలిగించింది. ఆ మహమ్మారి కారణంగా ఈ రెండు నెలలు పలు రంగాల పనులు వాయిదా పడ్డాయి. కొన్ని ప్రాజెక్టులు రద్దయ్యాయి. క్రికెట్ మ్యాచ్‌లు లేవు. షూటింగ్స్ లేకపోవడంతో ఇంటి దగ్గర ఉన్న సెలబ్రిటీలు కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. మరికొన్ని రోజుల్లో లాక్‌డౌన్ ముగుస్తుందనగా ఓ అసక్తికర విషయం వెలుగుచూసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.  ‘మూడుసార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నా’

తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుందని, నాలుగో సీజన్ కంటెస్టెంట్ల ఎంపిక కూడా జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. తమిళంలోనూ కంటెస్టెంట్ల ఎంపిక దాదాపు ఖరారు కావొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుం షో నిర్వహణ, రియాలిటీ షో విధానాలు, నియమాలను పాల్గొనబోయే కంటెస్టెంట్లకు వివరిస్తూ సెలబ్రిటీలను ఒప్పించేపనిలో నిర్వాహకులు బిజీగా ఉన్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.  బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్‌గా ఉన్న వారి జాబితా అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ వ్యక్తులు ఉన్నారని ఈ సీజన్ సరదాగా సాగిపోతుందని చెబుతున్నారు. యాంకర్ ఝాన్సీ, సింగర్ సునీత, సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్, తాగుబోతు రమేష్, మహాతల్లి జాహ్నవి, ‘కార్తీక దీపం’ సీరియల్ ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్క, జబర్దస్త్ కమెడియన్ నరేష్, నటుడు నందు పేర్లను పరిశీలించారని ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!

తొలి మూడు సీజన్లలో వరుసగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని, ‘కింగ్’ నాగార్జున తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్‌లుగా వ్యవహరించడం తెలిసిందే. అయితే నాలుగో సీజన్‌కు సైతం హోస్ట్‌గా నాగార్జున వ్యవహరించనున్నట్లు సమాచారం. హోస్ట్‌ను మార్చడంపై కథనాలు రాగా, షో నిర్వాహకులు ఆ వార్తల్ని ఖండించారు. గతంలో ‘మీలో ఎవరు కోటిశ్వరుడు’తో సక్సెల్ సాధించిన నాగార్జున బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్3కి హోస్ట్‌గా వ్యవహరించారు.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా! 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News