Muradnagar Crematorium roof collapse, death toll rises to 25 | న్యూఢిల్లీ: యూపీలోని ఘాజియాబాద్‌ మురాద్‌నగర్‌లో శ్మశానవాటికలోని షెల్టర్ పైకప్పు కూలి మరణించిన వారి సంఖ్య 25కి చేరింది. మృతుల్లో అందరూ పురుషులే ఉన్నారు. జైరామ్ అనే వ్యక్తి దహన సంస్కారాల (Cremations) కోసం ఆదివారం మృతుని బంధువులంతా మురాద్‌నగర్‌‌లోని శ్మశానవాటికకు చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో వర్షం కురవడంతో నిర్మాణంలో ఉన్న షెల్టర్ కిందకు వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పైకప్పు కూలిపోవడంతో (Roof Collapsed) శిథిలాల కింద చాలామంది చిక్కుకొని చనిపోగా.. మరికొంతమంది గాయపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముగ్గురి అరెస్ట్..
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 25 మంది మరణించారు. చాలామందికి గాయాలయ్యాయి. హుటాహూటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై (Uttar Pradesh) ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటనతో సంబంధించి అధికారులు.. జూనియర్ ఇంజనీర్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేశారు.  Also Read: 
Uttar Pradesh: యూపీలో విషాదం.. శ్మశానవాటిక పైకప్పు కూలి 17 మంది మృతి


అయితే ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ (Rajnath Singh), యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)‌ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు యూపీ సీఎం యోగి మృతుల కుటుంబాలకు రూ .2 లక్షల పరిహారం ప్రకటించారు. దీనిపై సమగ్రంగా నివేదిక సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. Also Read: Farmers Protest: నేడు ఏడోసారి కేంద్రం, రైతుల మధ్య చర్చలు.. ఫలించేనా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook