రూ.60 కోట్ల మోసం: నకిలీ జీఎస్టీ బిల్లుల కేసులో ముగ్గురు అరెస్ట్
నకిలీ జీఎస్టీ బిల్లులతో ప్రభుత్వ ధనానికి గండికొట్టిన ఘనులు
వ్యాపార సంస్థలకు మేలు చేకూర్చుతూ ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా నకిలీ జీఎస్టీ బిల్లులు సృష్టిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు మంగళవారం మీరట్‌లో అరెస్ట్ చేశారు. అక్టోబర్ 3నే ముఠా స్థావరంపై దాడులు నిర్వహించి సోదాలు జరిపిన పోలీసులు, సంబంధిత అధికారులు ముఠా సభ్యులు మోసాలకు పాల్పడుతున్నారనేందుకు అవసరమైన ఆధారాలు సేకరించారు. నియమనిబంధనల ప్రకారం వ్యాపార సంస్థలు నిర్వహించే లావాదేవీలపై ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో పన్నులు కట్టాల్సి ఉండగా.. ఈ ముఠా సభ్యులు పలు వ్యాపార సంస్థలకు నకిలీ జీఎస్టీ బిల్లులు రూపొందించి ఇస్తూ ఆయా సంస్థలు పన్ను ఎగవేసేందుకు సహాయపడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
మీరట్ పోలీసులు తెలిపిన వివరాలం ప్రకారం సుమారు రూ.300 కోట్ల లావాదేవీలకు సంబంధించి ఈ ముఠా రూ.60 కోట్ల విలువైన నకిలీ జీఎస్టీ బిల్లులు రూపొందించినట్టు తెలుస్తోంది.