బెంగళూరు: బెంగళూరులోని యలహంక వద్ద వున్న వైమానిక స్థావరంలో శనివారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వైమానిక స్థావరంలో ఎయిర్ షో జరుగుతుండగా పార్కింగ్ స్థలంలో అంటుకున్న మంటలు అక్కడే పార్క్ చేసి వున్న వాహనాలకు వ్యాపించాయి. దీంతో ఈ ప్రమాదంలో దాదాపు 300 వాహనాలు కాలిబూడిదయ్యాయని వైమానిక దళం, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) అధికారులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో భారీ మొత్తంలో ఆస్తి నష్టం సంభవించింది. అయితే, అదృష్టవశాత్తుగా ఎవ్వరికీ ఎటువంటి హానీ జరగలేదు. రెండు, మూడు గంటలపాటు శ్రమించిన అనంతరం మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"177281","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Bengaluru fire accident at Aero India 2019","field_file_image_title_text[und][0][value]":"బెంగళూరు ఎయిర్ షోలో అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన 300 వాహనాలు!"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Bengaluru fire accident at Aero India 2019","field_file_image_title_text[und][0][value]":"బెంగళూరు ఎయిర్ షోలో అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన 300 వాహనాలు!"}},"link_text":false,"attributes":{"alt":"Bengaluru fire accident at Aero India 2019","title":"బెంగళూరు ఎయిర్ షోలో అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన 300 వాహనాలు!","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఎయిర్ బేస్‌లోని 5వ నెంబర్ గేట్ వద్ద మంటలు అంటుకోగా.. అక్కడ నేలపై వున్న ఎండుగడ్డి కారణంగా పార్క్ చేసి వున్న వాహనాలకు కూడా నిప్పంటుకుంది. దీనికితోడు ఓ ఇంధనం ట్యాంకర్ కూడా పేలినట్టు తెలుస్తోంది.