భారత్‌లో కరోనా మరణ మృదంగం..
మహమ్మారి భారత్‌లో మరింతగా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా బలితీసుకునే ప్రాణాల సంఖ్య పెరిగిపోతోంది.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత్‌లో మరింతగా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా బలితీసుకునే ప్రాణాల సంఖ్య పెరిగిపోతోంది. అయితే గత 24 గంటల్లో దేశంలో కరోనా కారణంగా 35 మంది మృతిచెందారు. తాజా మరణాలతో కలిపి కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 308కి చేరుకుంది. భారత్‌లో మొత్తం 9152 కరోనా కేసులు నమోదయ్యాయి. బంగారం ధరలు పైపైకి.. గరిష్టానికి వెండి
ప్రస్తుతం 7987 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 856 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. నిన్న సంభవించిన 35 మరణాలతో కేవలం ఒక్క మహరాష్ట్రలోనే 22 నమోదు కావడం గమనార్హం. ఆదివారం తెలంగాణలో ఇద్దరు, ఏపీలో ఒక్క కరోనా మరణం నమోదు కావడం తెలిసిందే. Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos
ఏప్రిల్ 14న 21 రోజులపాటు కొనసాగిన లాక్‌డౌన్ గడువు ముగియనుంది. కరోనా వైరస్ వ్యాప్తి అవుతున్న నేపథ్యంలో ఈ గడువును మరింత కాలం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై ప్రకటన విడుదల చేయనున్నారు. తెలంగాణ, ఒడిషా రాష్ట్రాలు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ