Uttarakhand Earthquake: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో శనివారం ఉదయం రిక్టర్ స్కేల్‌పై (Richter Scale) 4.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఉత్తరకాశీకి (Uttarkashi) తూర్పున 39 కిలోమీటర్ల దూరంలో టెహ్రీ గర్వాల్ ప్రాంతంలో తెల్లవారుజామున 5.03 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం అక్షాంశం 30.72, రేఖాంశం 78.85 వద్ద 28 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఆధారాలు లేవు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత వారం ఆఫ్ఘనిస్తాన్-తజికిస్తాన్ సరిహద్దు (Earthquake in Afghanistan-Tajikistan border) ప్రాంతంలో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, నోయిడా వంటి ఇతర తరహా ప్రాంతాల్లో  ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంపం 181మీటర్ల లోతులో సంభవించింది.  ఈ ఘటనకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ఫోన్ చేసి కేంద్రపాలిత ప్రాంతంలోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదే రోజు ఉత్తరాఖండ్‌లో 3.6 తీవ్రతతో భూకంపం వచ్చింది.


భూకంపాలు ఏర్పడానికి కారణాలు ఏంటి?
భూకంపాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. భూగర్బజలాలను విపరీతంగా వాడటం వల్ల, అడవుల్లోని చెట్లను నరికిపవేయటం వల్ల భూకంపాలు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భూమి అంతర్గత పొరల్లో వచ్చే మార్పులు కూడా ఈ భూప్రకంపనలు కారణమై ఉండవచ్చని వారు అంటున్నారు. 


Also Read: Earthquake: ఢిల్లీ-NCRలో తీవ్ర భూకంపం...రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook