Earthquake of magnitude 4.3 hits near Ayodhya: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని అయోధ్య (Ayodhya) సమీపంలో భూకంపం సంభవించింది. గురువారం అర్దరాత్రి అయోధ్యలో సంభవించిన భూకంపం (Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) శుక్రవారం ఉదయం ఓ ప్రకటనలో తెలిపింది. అయోధ్య నగరానికి 176 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భూకంపం 15 కిలోమీటర్ల లోతులో వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు ట్వీట్ చేశారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో అయోధ్య (Ayodhya Earthquake) సమీపంలో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూ ప్రకంపనలతో భయపడిన జనం ఇళ్లలోంచి బయటకు వచ్చి పరుగులు తీశారట. అయితే ఈ భూకంపంతో ఎలాంటి ఆర్ధిక నష్టం వాటిల్లలేదని సమాచారం. అలానే ఎలాంటి ప్రాణ నష్టం కూడా లేదని తెలుస్తోంది. ఈ ఘనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Also Read: లైఫ్‌లో ఫస్ట్ టైం నువ్వు 'నెగటివ్' కావాలని కోరుకుంటున్నా.. సతీమణిపై హీరో నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!!




2022 జనవరి 1 సాయంత్రం 6.45 గంటలకు ఆప్ఘనిస్థాన్-తజకిస్థాన్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. అలాగే నియంత్రణ రేఖ వెంబడి జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సహా ఇతర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు కనిపించాయి. దాంతో భయపడిన జనం ఇళ్లలోంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. అంతకుముందు 2021 డిసెంబర్ 27న కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రగా 5.3గా నమోదైంది. 


Also Read: Viral Video: మా నాన్న ఎంపీటీసీ.. నన్నే ఆపుతవా..? పోలీసులకు 8వ తరగతి స్టూడెంట్ వార్నింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.