Fire accident in Bihar's Muzaffarpur: బీహార్ ముజఫర్‌పూర్ జిల్లాలోని ఓ టౌన్‌షిప్‌లో అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. గాయపడ్డ వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ ప్రమాదంలో ఇళ్లలోని సామాగ్రి మెుత్తం అగ్నికి అహూతైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలేం జరిగిందంటే..
ముజఫర్‌పూర్‌ జిల్లా సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామ్‌దయాలు స్లమ్ ఏరియాలోని ఓ ఇంట్లో అర్థరాత్రి సడన్ గా మంటలు చెలరేగాయి.  ఆ దావలనం పక్కనే ఉన్న ఇళ్లకు కూడా వ్యాపించింది.  తప్పించుకునే అవకాశం లేకుండా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న నరేష్‌రామ్‌కు చెందిన నలుగురు కుమార్తెలు మృత్యువాత పడ్డారు. అదే సమయంలో రాజేష్ రామ్, ముఖేష్ రామ్ ఇళ్లలో కూడా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురికి మంటలకు అంటుకున్నాయి. చికిత్స కోసం వారిని SKMCH ఆస్పత్రిలో చేర్పించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే మంటలు ఎలా చెలరేగాయో అనే విషయం తెలియరాలేదు.


Also Read: Afzal Ansari: కిడ్నాప్, హత్య కేసుల్లో బీఎస్పీ ఎంపీకి 4 ఏళ్లు జైలు శిక్ష.. లోక్‌సభ సభ్యత్వం రద్దు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook