దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించినట్లు టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా పేర్కొంది. రైల్‌టెల్‌ సహకారంతో ప్రయాణికులకు ఈ సదుపాయం కల్పించినట్లు పేర్కొంది. అసోంలోని దిబ్రూగర్‌ రైల్వేస్టేషన్‌లో గురువారం ఉచిత వైఫై ఏర్పాటు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని గూగుల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. లక్షలాది ప్రయాణీకులకు హైస్పీడ్‌ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావడం మరుపురాని అనుభవంగా గూగుల్‌ పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


డిజిటల్‌ ఇండియాలో భాగంగా 2016 జనవరిలో ఈ ఉచిత వైఫై కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా.. తొలిసారిగా ముంబై సెంట్రల్ స్టేషన్‌లో ఈ సదుపాయాన్ని కల్పించారు. ప్రాజెక్టును చేపట్టిన తొలి ఏడాదిలో దేశవ్యాప్తంగా 100 పెద్ద రైల్వేస్టేషన్‌లలో వైఫైను ఏర్పాటుచేశారు.ఈ వైఫైతో స్టేషన్లకు వచ్చే ప్రయాణికులు 30 నిమిషాల పాటు ఉచితంగా ఇంటర్నెట్‌ వినియోగించుకోవచ్చు.


పంచాయితీ కార్యాలయాల్లో 5 లక్షల వైఫై హాట్ స్పాట్లు


దేశవ్యాప్తంగా గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో దాదాపు రూ.4వేల కోటల పెట్టుబడితో 5 లక్షలకు పైగా హాట్‌స్పాట్లు ఏర్పాటు చేయడానికి టెలికాం విభాగం (డాట్) టెండర్లను ఆహ్వానించింది. ప్రతి పంచాయితీకి బ్రాడ్ బ్యాండ్ పరిజ్ఞానం లేదా వైఫై హాట్‌స్పాట్లు అధివ్వడమే లక్ష్యమని  టెండర్‌లో పేర్కొంది. ఈఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.