బడ్జెట్ 2018: మోదీ మహిళలపై కురిపించిన 5 వరాలు
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం దేశంలోని మహిళలకు ప్రయోజనం చేకూరేలా అనేక పథకాలను, తీసుకోబోయే చర్యలను ప్రకటించారు.
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం దేశంలోని మహిళలకు ప్రయోజనం చేకూరేలా అనేక పథకాలను, తీసుకోబోయే చర్యలను ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ 2018లో మహిళలకు మోదీ కురిపించిన వరాలు ఒకసారి పరిశీలిస్తే..
* అరుణ్ జైట్లీ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 8 కోట్ల మంది మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
* "బేటి బచావో బేటి పడావో" కింద, 2015 జనవరిలో 'సుకన్య సమృద్ధి ఖాతా' పథకం ప్రారంభించబడింది. నవంబర్ 2017 వరకు దేశవ్యాప్తంగా 1.26 కోట్ల ఖాతాలు తెరవగా, 19,183 కోట్ల రూపాయలను భద్రపరుచుకున్నారు.
* ప్రభుత్వం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ల కేటాయింపును 2018-19 బడ్జెట్ లో రూ.5750 కోట్లకు పెంచింది. 2016-17 బడ్జెట్ లో మహిళల స్వయం సహాయక బృందాలకు (పొదుపులక్ష్మీ గ్రూప్ ఎస్ హెచ్ జీ) 42,600 కోట్ల రూపాయలను రుణాలుగా ఇచ్చారు. బడ్జెట్ 2018లో ఆ రుణాన్ని 37 శాతానికి పెంచారు. మార్చి 2019 నాటికి మహిళల స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రుణాలు రూ.75,000 కోట్లకు చేరుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
* ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో, మహిళల నుండి కేవలం ఎనిమిది శాతం ఈపీఎఫ్ వసూలు
* వృద్దులు, వితంతువులు, అనాధ పిల్లలు, దివ్యాంగుల కోసం ఈ ఏడాది 'నేషనల్ సోషల్ అసిస్టెన్స్' కార్యక్రమానికి రూ.9,975 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు.. వీటిని సామాజిక భద్రత, రక్షణ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తామని చెప్పారు.