7th Pay Commission: త్వరలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందనుందా అంటే అవుననే అంటున్నాయి అధికారవర్గాలు. డీఏ పెంపుపై త్వరలో కీలక నిర్ణయం రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏఐసీపీఐ(AICPI) ధృవీకరిస్తోంది. జూలై నెలలో డీఏ పెంపు ఉండనుంది. డీఏ ఐదు శాతం పెంపు ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే డీఏ 39 శాతానికి చేరనుంది. ఏటా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ఏడాదికి రెండు సార్లు సవరిస్తారు. మొదట జనవరి నుంచి జూన్ వరకు ఇస్తారు. రెండోది జూలై నుంచి డిసెంబర్‌ వరకు వస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈఏడాది మార్చిలో కరువు భత్యాన్ని పెంచారు. గతేడాది డిసెంబర్‌లో ఏఐసీపీఐ(AICPI) సంఖ్య 125.4గా ఉంది. ఐతే ఈఏడాది జనవరిలో ఏఐసీపీఐ(AICPI) 0.3 పాయింట్లు క్షీణించి 125.1కి చేరింది. ఈఏడాది ఫిబ్రవరిలో ఆలిండియా సీపీఐ-ఐడబ్ల్యూ(CPI-IW) 0.1 పాయింట్లు తగ్గి..125.0 వద్దకు చేరింది. అదే మార్చి నెలలో ఒక్క పాయింటు పెరిగింది. దీంతో ఏఐసీపీఐ సూచీ గణాంకాలు 126కి చేరింది. 2022 ఏప్రిల్‌లో ఆలిండియా సీపీఐ-ఐడబ్ల్యూ(CPI-IW) 1.7 పాయింట్లు పెరిగి..127.7గా ఉంది.


ఈ విషయాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. ఇటు ద్రవ్యోల్బణం సైతం 6.33 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం గత నెలలో 6.27 శాతం నుంచి 7.05 శాతానికి చేరింది. గతేడాది ఇదే నెలలో ద్రవ్యోల్బణం 4.78 శాతంగా ఉంది. ఏఐసీపీ ఇండెక్స్‌ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెరిగే అవకాశం ఉంది. దీని కోసం 1.16 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు ఎదురు చూస్తున్నారు. డీఏ పెరిగితే ఈఏడాది జనవరి నుంచి ఉద్యోగులకు ఇవ్వనున్నారు. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా పెరుగుదల ఉండనున్నట్లు తెలుస్తోంది.


Also read: Supreme court: ఆర్య సమాజ్‌లో జరిగే పెళ్లిళ్లు ఇక చెల్లవు..సుప్రీం కోర్టు సంచలన తీర్పు..!


Also read:Atchutapuram Gas Leak: అచ్యుతాపురంలో అమోనియా లీక్..పలువురికి అస్వస్థత..సీఎం ఆరా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook