Covid 19: బీజేపీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం.. 50 మందికి పాజిటివ్...
50 staff members tests covid 19 positive at BJP head quarters : ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో దాదాపు 50 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం వీరంతా ఐసోలేషన్‌లో ఉన్నట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
50 staff members tests covid 19 positive at bjp head quarters : దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో 50 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. వీరిలో పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందితో పాటు మీడియా ఇన్‌చార్జి సంజయ్ మయూఖ్ ఉన్నారు. ప్రస్తుతం వీరంతా కోవిడ్ 19 ప్రోటోకాల్ పాటిస్తూ ఐసోలేషన్‌లో ఉన్నట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
'ఇప్పటికే పార్టీ కార్యాలయం మొత్తం శానిటైజ్ చేయించాం. రెగ్యులర్‌గా కోవిడ్ టెస్టులు చేయిస్తున్నాం. కేవలం ముఖ్యమైన పనులు ఉన్నవారు మాత్రమే కార్యాలయానికి వస్తున్నారు.' అని బీజేపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ కోర్ కమిటీ సమావేశం మంగళవారం (జనవరి 11) ఇదే కార్యాలయంలో జరిగింది. ఆ మరుసటి రోజే ఇంతమంది కరోనా బారినపడినట్లు వెలుగులోకి రావడం గమనార్హం. ఇదే కార్యాలయంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ఇవాళ బీజేపీ కోర్ కమిటీ మరోసారి సమావేశం కావాల్సి ఉంది.
రెండు రోజుల క్రితమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలు బయటపడటంతో కోవిడ్ టెస్టులు చేయించుకోగా... ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల తనను కలిసినవారు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, బిహార్ సీఎం నితీశ్ కుమార్, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అజయ్ భట్ కూడా రెండు రోజుల క్రితం కరోనా బారినపడ్డారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసుల (Covid 19 cases) సంఖ్య వేగంగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బుధవారం (జనవరి 12) కొత్తగా మరో 1,94,720 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 442 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 9,55,319 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగింది. కొద్ది రోజుల క్రితం వరకు 10 వేల మార్క్‌కి కాస్త అటు, ఇటుగా నమోదైన కేసులు ఉన్నట్టుండి లక్ష మార్క్‌ని దాటడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: Covid-19 Update: రాష్టంలో 1,700 మంది పోలీసులకు కరోనా.. అప్రమత్తమైన అధికారులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook