న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లీగి జమాత్ నిర్వహించిన మతపరమైన కార్యక్రమం వల్లనే రెండు రోజుల్లోనే దేశంలో 647 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్రం ఒక బులెటిన్ విడుదల చేసింది. కాగా దేశంలోని 14 రాష్ట్రాలు (కేంద్రపాలిత ప్రాంతాలు) అండమాన్ నికోబార్ దీవులు,ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, అసోం, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, జమ్మూ, కశ్మీర్, జార్ఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లలో కరోనా పాజిటివ్ కేసుల పరంపర కొనసాగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: దిగ్విజయ్ సింగ్ కు కొత్త తలనొప్పి..


కాగా గత 24 గంటల్లో 12 మరణాలు సంభవించగా, వీటిలో తబ్లీగి జమాత్ సమావేశానికి హాజరైన వారివి ఉన్నాయని, ఇప్పటివరకు దేశంలో 2,897 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 75 మరణాలు సంభవించాయని, వీటిలో 12 మరణాలు గత 24 గంటల్లో సంభవించాయని అయన అన్నారు. అయితే గత రెండు రోజుల్లో కొత్తగా 336 కరోనా వైరస్ కేసులు పెరిగాయని, ఈ రెండు రోజుల్లో అత్యధిక కేసుల నమోదుకు ప్రధాన కారణం తబ్లీగి జమాత్ యే కారణమని పేర్కొన్నారు.   


Also Read: కరోనా చికిత్సకు సహకరించని ముస్లింలకు అదే శిక్ష విధించాలి: రాజా సింగ్


లాక్‌డౌన్, సామాజిక దూరాన్ని పాటించేలా ప్రోత్సహించడానికి తాము చేసిన కృషి ఫలితంగా కొన్ని కరోనా కేసులు నమోదైనప్పటికీ గణనీయంగా పెరగలేదని ఆయన తెలిపారు. కాగా ఇప్పటివరకు కరోనా సోకిన 206 మంది కోలుకున్నారని, దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 8,000కు పైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసిఎంఆర్) అధికారి తెలిపారు. కరోనా పరీక్షలు నిర్వహించడానికి దేశంలో 182 ల్యాబ్‌ లు అందుబాటులో ఉన్నాయని వీటిలో 130 ప్రభుత్వ ల్యాబ్‌ లున్నాయని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..