67 Pornographic websites: ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్‌ని అతిక్రమిస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్న 67 అశ్లీల వెబ్‌సైట్లను నిషేధించాల్సిందిగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను కేంద్రం ఆదేశించింది. గతేడాది ప్రకటించిన ఐటి చట్టం మార్గదర్శకాలకు తూట్లుపొడుస్తూ ఈ 67 బూతు వెబ్‌సైట్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా పూణె కోర్టు, ఉత్తరాఖండ్ హై కోర్టుల నుంచి కేంద్రానికి వేర్వేరుగా ఆదేశాలు అందాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళలు, చిన్నారుల మానానికి, గౌరవానికి భంగం కలిగించేలా అడల్ట్ కాంటెంట్‌ని ప్రోత్సహిస్తోన్న సదరు పోర్నోగ్రఫిక్ వెబ్‌సైట్లపై నిషేధం విధించాల్సిందిగా కోరుతూ కేంద్రానికి అందిన జాబితాలో 63 వెబ్‌సైట్ల జాబితాను పూణె కోర్టు అందివ్వగా.. మరో నాలుగు వెబ్‌సైట్ల పేర్లతో కూడిన జాబితాను ఉత్తరాఖండ్ హైకోర్టు అందజేసింది. దీంతో ఆ 67 బూతు వెబ్‌సైట్లపై కొరడా ఝులిపిస్తూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రం ఈ ఆదేశాలు జారీచేసింది. గతంలోనూ అనేక సందర్భాల్లో పోర్నోగ్రఫిక్ కాంటెంట్‌ని ప్రోత్సహించే బూతు వెబ్‌సైట్ల భరతం పడుతూ కేంద్రం కఠిన చర్యలు తీసుకోవడం తెలిసిందే.


Also Read : Mukesh Ambani’s security: ముఖేష్ అంబానికి Z ప్లస్ కేటగిరి భద్రత


Also Read : Supreme Court: భార్యను బలవంతం చేసినా అత్యాచారమే.. అబార్షన్ చట్టబద్దమే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు..


Also Read : Free Condoms Controversy: రేపు కండోమ్స్ కూడా అడుగుతారు.. విద్యార్థినిపై మండిపడిన ఐఏఎస్ ఆఫీసర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి