Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
రాజస్థాన్ ( Rajasthan ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) చోటుచేసుకుంది. రాష్ట్రంలోని చిత్తోర్‌గఢ్ (Chittorgarh)లో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు.
Rajasthan Road Accident - 7 persons killed: న్యూఢిల్లీ: రాజస్థాన్ ( Rajasthan ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) చోటుచేసుకుంది. రాష్ట్రంలోని చిత్తోర్‌గఢ్ (Chittorgarh)లో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. చిత్తోర్‌గఢ్ నికుంభ్ పోలీస్ స్టేషన్ పరిధిలో లారీ, క్రూజర్ వాహనాలు రెండూ ఎదురెదురుగా ఢికొనడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) విచారం వ్యక్తంచేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయనతోపాటు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లాట్ (Ashok Gehlot) కూడా సంతాపం వ్యక్తం చేశారు. Also read: Farmer protests: ఉద్యమంలోకి అలాంటి వారు ప్రవేశిస్తే అరెస్ట్ చేయండి
రాజస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం.. మధ్యప్రదేశ్‌లో శనివారం జరిగిన శుభ కార్యక్రమానికి హాజరై క్రూజర్‌లో తిరిగి వస్తున్న క్రమంలో చిత్తౌడ్‌గఢ్ వద్ద భారీ వాహానం బలంగా ఢికొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read: Farmer protests: వ్యవసాయ చట్టాలపై సుప్రీంను ఆశ్రయించిన రైతులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe