Kullu road accident: హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం (Kullu accident) చోటుచేసుకుంది. టూరిస్టులతో వెళుతున్న ఓ టెంపో అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు పర్యాటకులు మరణించగా, 10 మంది గాయపడ్డారు. బంజార్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఘియాగి వద్ద హైవే-305పై జలోడా సమీపంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో  ఐదుగురు యువకులు, ఇద్దరు బాలికలు ఉన్నారు. ప్రయాణికుల్లో ముగ్గురు ఐఐటీ వారణాసి విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై బంజర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కారు జలోడీ పట్టుకుని జిభి వైపు వస్తున్నట్లు ఎస్ఎస్పీ కులు గురుదేవ్ శర్మ తెలిపారు. కారు జలోడా సమీపంలోకి రాగానే అదుపుతప్పి హైవేకి 400 మీటర్ల దిగువన ఉన్న లోయలో పడిపోయింది. కారులో 16 మంది ఉన్నారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన 11 మందిని బంజార్ ఆసుపత్రిలో చేర్చారు. క్షతగాత్రులను రక్షించేందుకు పోలీసులు, హోంగార్డు సిబ్బంది, స్థానికులు మూడు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. గాయపడిన వారిలో కొందరు ఉద్యోగస్తులు కాగా మరికొందరు విద్యార్థులు. వీరంతా ఢిల్లీ నుంచి ట్రావెల్ ఏజెన్సీ ద్వారా సందర్శించేందుకు వచ్చారు. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న బంజర్ ఎమ్మెల్యే సురేంద్ర శౌరీ కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. 


Also Read: Rajasthan political crisis: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం.. రాజీనామాకు సిద్ధమైన 90 మంది ఎమ్మెల్యేలు..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook