Rape in Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ (Jabalpur) జిల్లాలో దారుణం వెలుగుచూసింది. 62 ఏళ్ల వృద్దురాలిపై 75 ఏళ్ల వృద్దుడు అత్యాచారానికి (Rape) పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. బాధితురాలికి, నిందితుడికి పాత గొడవలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసుల కథనం ప్రకారం... జబల్‌పూర్‌ (Jabalpur) జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 62 ఏళ్ల వృద్దురాలు తన ఇంటి యజమాని అయిన 75 ఏళ్ల వృద్దుడిపై ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గత కొద్ది నెలలుగా అతను తనపై పలుమార్లు అత్యాచారానికి (Rape) పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. మహారాష్ట్రకు చెందిన తాను జబల్‌పూర్‌లోని అతని ఇంట్లో నివాసం ఉంటున్నట్లు తెలిపింది. అదే ఇంట్లో తనపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది.


అత్యాచార విషయం బయటకు పొక్కితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తనను బెదిరించాడని పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వృద్దురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆ వృద్దురాలు కిరాణ దుకాణం నిర్వహిస్తున్నట్లు తెలిసిందని... కొంతకాలంగా ఇంటి యజమానితో ఆమెకు గొడవలు జరుగుతున్నట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు, గతంలో ఆమెపై అతను చెక్ బౌన్స్ కేసు పెట్టాడని చెప్పారు. అత్యాచార కేసుపై (Crime against Women) ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది జులైలో చెన్నైలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. 88 ఏళ్ల వృద్దురాలిపై 73 ఏళ్ల వృద్దుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరుమంగళం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు లోపలికి చొరబడి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.


Also Read: Headmaster : విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ హెడ్మాస్ట‌ర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook