దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. బాలికపై సివిల్ ఢిఫెన్స్ అధికారి అత్యాచారం

Minor Girl Raped In Delhi: ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. బిందాపూర్ ఏరియాలోని ఓ బాలికపై సివిల్ ఢిఫెన్స్ లో పనిచేస్తున్న అభిషేక్ కుమార్ దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2021, 10:27 AM IST
    • దేశ రాజధాని ఢిల్లీలో దారుణం
    • మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సివిల్ ఢిఫెన్స్ అధికారి
    • నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. బాలికపై సివిల్ ఢిఫెన్స్ అధికారి అత్యాచారం

Minor Girl Raped In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. బిందాపూర్ ఏరియాలోని ఓ మైనర్‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడో ప్రబుద్ధుడు. సివిల్ ఢిఫెన్స్ లో పనిచేస్తున్న అభిషేక్ కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. అతడ్ని అరెస్టు చేశారు.

ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ కు చెందిన అభిషేక్ కుమార్.. సివిల్ ఢిఫెన్స్ లో పనిచేస్తున్నాడు. బాధితురాలు గత బుధవారం ఇంటి నుంచి కోచింగ్ సెంటర్‌కు వచ్చి, తిరిగి వెళ్లేందుకు మటియాలా రోడ్డులో వేచి ఉంది. అదే సమయంలో అటుగా మోటార్‌సైకిల్‌పై వచ్చిన అభిషేక్ ఇంటి దగ్గర దింపే నెపంతో తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

నిందితులు బాధితురాలిని కోచింగ్ సెంటర్‌కు తీసుకెళ్లి పోలీసుగా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ఓ పార్కుకు తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసు అధికారి తెలిపారు. బాలిక కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. విచారణలో, పోలీసులు మటియాలా, జైన్ కాలనీ, రాజపురిలో అమర్చిన 150కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీని స్కాన్ చేశారు. ఒక ఫుటేజీలో, ఆమె మోటారుసైకిల్‌పై వెళుతున్నట్లు కనిపించింది. ఈ ఆధారంతో నిందితుడిని గుర్తించి శనివారం రాజపురి ప్రాంతం నుండి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

Also Read: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, భారీ వర్షాలు తప్పవు

Also Read: 18+ మహిళలకు నెలకు రూ.1000.. పంజాబ్‌లో అరవింద్ కేజ్రీవాల్ హామీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News