భారతదేశ స్వాతంత్య్ర సమరయోధులు బ్రిటిష్ వారి నుండి భానిస సంకెళ్ల విముక్తి కోసం సుదీర్ఘమైన మరియు కఠినమైన పోరాటం చేశారు. 75 వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుతున్న మనకు వారి మనసుల్లో స్పూర్తి నింపిన కొన్ని నినాదాల గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆగస్టు 15, 2021 న దేశవ్యాప్తంగా 75 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని(75th Independence Day) , కరోనా వైరస్ (Corona Virus) మహమ్మారి మధ్య జరుపుకుంటుంది. 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకోవడానికి మరియు దానిని 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' గా స్మరించుకోవడానికి, ఆలకించే జాతియ గీతాని వీడియో తీసి పోస్ట్ చేయాలని ప్రజలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అవసరమైన కరోనా నివారణ చర్యలను అనుసరించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీ చేసింది.


భారతదేశ 75 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీ ప్రభుత్వం సోమవారం 'ఢిల్లీ సచివాలయం' నుండి 'రాజ్ ఘాట్' వరకు ఉత్సవాలను ప్రారంభించింది.


Also Read:భయం గుప్పిట్లో బెంగళూరు, చిన్నారుల్ని టార్గెట్ చేస్తున్న కరోనా మహమ్మారి


సుదీర్ఘ పోరాటం, కఠిన నియమ నిబంధనలతో చేసిన స్వాతంత్య్ర పోరాటంలో ఏంటో మంది ప్రాణ త్యాగాలను చేసి దేశాన్ని బ్రిటిష్ చేర నుండి విడిపించారు. చాలా కాలం నుండి మనలో ధైర్యాని, ప్రోత్సహించిన వారి మాటలను, నినాదాలను తెలుసుకుందాం.  


1. రవీంద్రనాథ్ ఠాగూర్ (Rabindranath Tagore) : " ఎక్కడైతే మనసు భయం లేకుండా ఉంటుందో, అక్కడ మనం తల ఎత్తుకొని చూస్తాం"
 


2. బిఆర్ అంబేద్కర్ (BR Ambedkar): "మానసికంగా పొందే స్వేచ్చే నిజమైన స్వేచ్చ. ఆంక్షలతో కూడిన మనసు గల వ్యక్తి ఎన్నటికైనా భానిసే, ఎప్పటికీ స్వేచ్చా మనిషి కాలేడు. మనసు స్వేచ్చాగా లేని వ్యక్తి ఖైదు చేయనప్పటికీ అతడు స్వేచ్చా మనిషి కాదు. స్వేచ్చా మనసు కలిగి లేని వ్యక్తి సజీవంగా ఉన్నప్పటికీ బ్రతికి ఉండి కూడా వ్యర్థం. స్వేచ్చ మనసు అనేది ఒక వ్యక్తి యొక్క ఉనికికి రుజువు. 
 


3. మహాత్మాగాంధీ (Mahatma Gandhi): "స్వేచ్చ అనేది ఎన్నటికీ విలువ కట్టలేనిది. అది మనిషి జీవితం యొక్క ఊపిరి. ఏం చెల్లిస్తే మనిషి స్వేచ్చగా జీవిస్తాడు" 
 


4. చంద్ర శేఖర్ ఆజాద్ (Chandra Shekhar Azad): "శత్రువులు పేల్చే తూటాలకు ఎదురు నిలబడతాము.. స్వేచ్చగా బ్రతుకుతున్నాము, స్వేచ్చగా బ్రతుకుతూనే ఉంటాం".
 


5. రాంప్రసాద్ బిస్మిల్ (Ramprasad Bismil): "చింతలేదు మాకు మా గురించి, బాధపడతాం తల్లి భారతి భానిస సంకెళ్ళు చూసి, దేశ  స్వాతంత్ర్యం కోసం మట్టిలో కలిసేందుకు మేము సిద్దం"  
 


6. సుభాష్ చంద్ర బోస్ (Subhash Chandra Bose): "నువ్వు నాకు నీ రక్తాన్ని  ఇవ్వు, నేను కు నీకు స్వాతంత్య్రం  ఇస్తా"
 


7. బాల గంగాధర్ తిలక్ (Bal Gangadhar Tilak): "స్వేచ్చ నా జన్మహక్కు అది నేను తప్పక పొందుతాను"
 


8. భగత్ సింగ్ (Bhagat Singh): "ఇంక్విలాబ్ జిందాబాద్"
 


9. లాల్ బహదూర్ శాస్త్రి (Lal Bahadur Shastri): "జై జవాన్ జై కిసాన్"
 


10. బంకిం చంద్ర ఛటర్జీ (Bankim Chandra Chatterjee): "వందేమాతరం"


Also Read: Allu Arjun Movie Update: అంచనాలు పెంచేసిన "దాక్కో దాక్కో మేక సాంగ్"!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook