7th Pay Commission Latest News: ఇటీవల దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు తీపి కబురు అందించాయి. ఈ ఏడాది రెండో డీఏ పెంపును దీపావళి గిఫ్ట్‌గా అందించాయి. కొన్ని రాష్ట్రాలు 3 శాత డీఏ ప్రకటించగా.. మరికొన్ని రాష్ట్రాలు ఉద్యోగులకు 4 శాతం డీఏను పెంచాయి. కేంద్ర ప్రభుత్వం కూడా నాలుగు శాతం డీఏను పెంచింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం డీఏ ప్రస్తుతం 46 శాతానికి చేరింది. పెంచిన డీఏను జూలై 1వ తేదీ నుంచి అమలు చేసింది. దీంతో మూడు నెలల బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో పడ్డాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత DA పెంచిందో ఇక్కడ తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం గత వారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం డీఏ, డీఆర్ పెంచింది. దీంతో రాష్ట్రంలో 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. జూలై 1 నుంచి పెరిగిన డీఏ అమలులోకి వస్తుంది. అదేవిధంగా ఉద్యోగులకు పండుగ ఆనందాన్ని తెస్తూ.. చండీగఢ్ UT పరిపాలన దీపావళి సందర్భంగా ప్రభుత్వ, చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగులకు  4 శాతం డీఏను పెంచింది. తాజా పెంపుతో డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగాయి. దాదాపు 20 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరింది. ఈ మేరకు అక్టోబర్ 20న ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది.
 
అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగులకు 3.75 శాతం డీఏ పెంపును ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 35 శాతం నుంచి 38.75 శాతానికి సవరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. UGC/AICTE/ICAR స్కేల్‌లోని లెక్చరర్లు, న్యాయాధికారులకు డీఏలో నాలుగు శాతం పెంపు ఉంటుందని వెల్లడించింది. దీపావళి గిఫ్ట్‌గా తమిళనాడు ప్రభుత్వం ఈసారి 4 శాతం డీఏ పెంపును ప్రకటించింది. జూలై 1వ తేదీ నుంచి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్‌తో 4 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. అస్సాం ప్రభుత్వం గత వారం ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపును ప్రకటించింది. దీంతో 46 శాతానికి పెరిగింది. తాజా పెంపు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. 


ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపావళి కానుకగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏలో 4 శాతం పెంపును ప్రకటించింది. దీంతో డీఏను 42 నుంచి 46 శాతానికి పెంచినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం యోగి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిడెడ్ విద్యా, సాంకేతిక విద్యా సంస్థలు, పట్టణ సంస్థలు, యూజీసీ ఉద్యోగులకు బేసిక్ జీతంలో 46 శాతం చొప్పున డీఏను అందిస్తామని తెలిపారు. 


Also Read: CM Jagan: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్.. ఒక్కొక్కరికి రూ.లక్షన్నర వరకు..!


Also Read: Revanth Reddy: మీ ఆత్మగౌరవాన్ని ఒక ఫుల్ బాటిల్‌కో.. ఐదు వేలకో తాకట్టు పెట్టకండి: రేవంత్ రెడ్డి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook