7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఒకేసారి మూడు కీలక ప్రకటనలు..?
7th Pay Commission Latest Update: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర గుడ్‌న్యూస్ అందించనుందా..? హోలీ సందర్భంగా మూడు కీలక ప్రకటనలు చేయబోతుందా..? ఉద్యోగుల డిమాండ్‌పై కేంద్ర నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరనున్నాయి..?
7th Pay Commission Latest Update: జీతాల పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్‌లో భారీ వరాలు ఉంటాయని ఆశలు పెట్టుకున్నా.. చివరికి నిరాశే ఎదురైంది. అయితే మార్చి నెలలో వరుసగా శుభవార్తలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. డీఏ పెంపు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, పెండింగ్‌లో ఉన్న 18 నెలల డీఏపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి ఈ ప్రకటనలు వెలువడితే ఉద్యోగుల జీతాలు భారీగా పెరుగుతాయి. హోలీ గిఫ్ట్‌గా ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 7వ వేతన సంఘం కింద జీతాలు అందజేస్తున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేవలం మరో ఏడాది సమయం మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వేతన సవరణకు కొత్త ఫార్ములాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
ఫ్యాక్టర్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కూడా పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగుల డిమాండ్‌పై కేంద్ర నిర్ణయం తీసుకుంటే.. ఉద్యోగుల జీతాల్లో భారీ పెరుగుదల ఉండనుంది. ప్రస్తుతం ఉన్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 నుంచి 3.68 శాతానికి పెంచాలని కోరుతున్నారు. 2.57 శాతం ప్రకారం.. 18000 (18,000X 2.57 = 46260) మూల వేతనంపై ఉద్యోగులు రూ.46,260 పొందుతున్నారు. 3.68 శాతానికి పెంచితే ఇతర అలవెన్సులు మినహాయిస్తే జీతం 26000X3.68 = రూ.95,680 అవుతుంది.
డీఏ పెంపు ప్రకటనపై ఉద్యోగుల్లో భారీగా ఆశలు ఉన్నాయి. మార్చిలో కచ్చితంగా ప్రకటన ఉంటుందని నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 38 శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ని పొందుతున్నారు. ఇది 42 శాతానికి పెరిగే అవకాశం ఉంది. డీఏ పెంపుపై ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జనవరి నెల నుంచి వర్తించనుంది. పింఛనుదారుల డీఆర్‌ను కూడా ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్‌లో పెండింగ్ డీఏ ఒకటి. కరోనా సమయంలో 18 నెలల డీఏ చెల్లింపును ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. తమకు బకాయి ఉన్న డీఏను చెల్లించాలని ఉద్యోగుల నుంచి చాలా కాలంగా కోరుతున్నారు. పెండింగ్ డీఏ బకాయిలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే.. ఒకేసారి ఉద్యోగుల ఖాతాలో ఒకేసారి భారీగా నగదు జమకానుంది.
Also Read: Jayamangala Venkataramana: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ బంపర్ ఆఫర్.. టీడీపీకి షాక్..!
Also Read: Aadhaar Update: ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయా..? ఇలా సరిచేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook