Aadhaar Update: ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయా..? ఇలా సరిచేసుకోండి

Aadhar Card Correction Online: ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయా..? మీ సేవా, ఆన్‌లైన్ సెంటర్‌లకు వెళ్లేందుకు టైమ్ లేదా..? ఇంట్లోనే కూర్చొని అప్‌డేట్ చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2023, 12:56 AM IST
Aadhaar Update: ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయా..? ఇలా సరిచేసుకోండి

Aadhar Card Correction Online: చాలామంది ఆధార్ కార్డులో తప్పులు సరిచేసుకునేందుకు, ఫోన్ నంబరు అప్‌డేట్ చేసుకునేందుకు మీ సేవా, ఆన్‌లైన్ కేంద్రాల చుట్టూ తిరుగుతుంటారు. అయితే ఇలాంటి ఇబ్బందులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) చెక్ పెట్టింది. ఇంట్లో కూర్చునే మీరు ఆధార్ కార్డులు మార్పులు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు.. మార్పులు సులభంగా చేసుకోవచ్చు.

ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి ఆధార్ కార్డు కావాల్సిందే. అన్ని బ్యాంకింగ్ సౌకర్యాల కోసం.. మొబైల్ ఫోన్ సిమ్ కోసం కూడా ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే. ఇక అద్దె ఇళ్లలో నివసిస్తున్న వాళ్లు.. ఇల్లు మారిన ప్రతిసారి తమ చిరునామాను మార్చాల్సి ఉంటుంది. ఇంటి చిరునామాను ఆన్‌లైన్‌లో ఈజీగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డులో వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ డేటా, ఫొటో, చిరునామా తదితరాలకు సంబంధించిన సమాచారాన్ని మార్చాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్ లేదా చిరునామాతో సహా వ్యక్తుల ఆధార్ కార్డ్‌లో చాలా తప్పులు జరుగుతాయి. ఆధార్ కార్డు ఎంట్రీ చేసేటప్పుడు చాలా వరకు ఇలాంటి తప్పులు జరుగుతాయి. ఇక అమ్మాయిలు తమ పెళ్లి తర్వాత తమ ఇంటిపేరును ఆధార్ కార్డులో పేరుతో మార్చుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు కొత్త ఇంటి చిరునామా కూడా మార్చుకోవాలి. 

మీ ఆధార్‌ని ఇలా అప్‌డేట్ చేసుకోండి..

==> ముందుగా మీరు ఆధార్ Uidai.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి
==> ఆ తరువాత మొబైల్ నంబర్, ఓటీపీతో లాగిన్ చేయండి
==> అక్కడ చూపించిన క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి
==> ఇప్పుడు మీ ఫోన్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి.. సబ్మిట్‌పై క్లిక్ చేయండి 
==> ఆ తరువాత మీరు ఆన్‌లైన్ ఆధార్ సేవకు వెళ్లాలి 
==> జాబితాలో పేరు, అడ్రస్, లింగం, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ జాబితా కనిపిస్తుంది.  
==> మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఏ సమాచారాన్ని అయినా ఎంచుకోవచ్చు.
==> What do you want to Update ఆప్షన్‌పై క్లిక్ చేయండి 
==> కొత్త పేజీలో మీరు క్యాప్చా ఎంటర్ చేసి.. ఓటీపీ ధృవీకరణ చేయాలి.
==> సేవ్ చేసి ప్రొసీడ్‌పై క్లిక్ చేయండి. ఆ తరువాత మీ ఆధార్ కార్డు అప్‌డేట్ అవుతుంది. 

Also Read: CM KCR: ఒక్క మాట నిరూపించండి.. రాజీనామా చేస్తా: సీఎం కేసీఆర్ సవాల్

Also Read: KL Rahul: రెండో టెస్ట్‌కు కేఎల్ రాహుల్ దూరం.. బీసీసీఐ అధికారి క్లారిటీ..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News