7th Pay Commission Latest Updates: కర్ణాటక రాష్ట్ర ఉద్యోగుల జీతాలపై సీఎం సిద్దరామయ్య కీలక ప్రకటన చేశారు. ఏడో వేతన సంఘం తుది నివేదిక తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏడో వేతన సంఘం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షడక్షరి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం హోం కార్యాలయం కృష్ణాలో ముఖ్యమంత్రిని కలిసింది. మార్చి వరకు గడువు పెంచి.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకటించకముందే వేతన సవరణను ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ విషయంపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఏడో వేతన సంఘం నివేదిక తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మిగతా డిమాండ్లపై కూడా సానుకూలంగా స్పందించారని సంఘం ప్రతినిధులు తెలిపారు. కొత్త పెన్షన్ విధానంలో ఉన్న 11,366 మందిని పాత పెన్షన్ స్కీమ్‌లో చేర్చారని.. మిగిలిన వారిని కూడా పాత పెన్షన్‌ విధానంలో చేర్చాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు. పింఛన్‌కు సంబంధించిన కంట్రిబ్యూషన్‌ను నిలిపివేయాలని వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఉచిత ఆరోగ్య పథకం అమలు చేయాలని కోరినట్లు చెప్పారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు. 


మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన సంఘం ప్రకటన వస్తుందని నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం 46 శాతం డీఏను కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు అందుకుంటున్న విషయం తెలిసిందే. మరోసారి 4 శాతం డీఏ పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీఏ పెంపునకు సంబంధించిన ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. 


Also Read: Chandrababu Case: క్వాష్ కొట్టివేత, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరేమన్నారంటే


Also Read: Upcoming Best OLED TVs 2024: Samsung, LGకి షాక్‌..డెడ్‌ చీప్‌ ధరకే AI ప్రాసెసర్‌తో మార్కెట్‌లోకి Panasonic OLED టీవీలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter