4 Percent DA Hiked for Government Emplpyees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది రెండో డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. మొదటి డీఏ 4 శాతం పెరగ్గా.. 42 శాతానికి చేరుకుంది. రెండో డీఏ ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి వర్తించనుంది. ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాత డీఏ పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వారం రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన డీఏ జనవరి 1వ తేదీ నుంచి వర్తిస్తున్నట్లు వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 31 శాతం డీఏ పొందుతున్నారు. తాజాగా 4 శాతం డీఏ పెంచడంతో 35 శాతానికి చేరింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద ప్రయోజనం చేకూరనుంది. వీరికే కాకుండా రాష్ట్ర ఏకీకృత నిధి ద్వారా వారి విద్యాసంస్థలు పెన్షన్ లేదా జీతం పొందుతున్న వారి పెన్షనర్లు, ఉద్యోగులకు డీఏ పెంపు వర్తించనుందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 


2018 సంవత్సరానికి సవరించిన వేతన స్కేల్ ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతున్నట్లు ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ పెరిగిన డీఏ జనవరి 1వ తేదీ నుంచి అంటే ఈ ఏడాది ఒకటో తేదీ నుంచే వర్తిస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  


Also Read: Allu Arjun Pushpa 2 : పుష్ప 2 టీంకు షాక్.. యాక్సిడెంట్‌లో అందరికీ గాయాలు


ఇటీవల అనేక రాష్ట్ర ప్రభుత్వాలు డీఏను పెంచుతున్న విషయం తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం కూడా డీఏను 4 శాతం పెంచింది. దీంతో ఆ రాష్ట్రంలో డీఏ 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో్ని 16 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరింది. పెంచిన డీఏ ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తింపజేసింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ కూడా పెంచింది. ఈ రాష్ట్రంలో కూడా డీఏ 42 శాతానికి చేరింది.   


Also Read: Margadarsi Assets: మార్గదర్శి కేసులో కీలక పరిణామం, 793 కోట్ల చరాస్థుల జప్తుకు సిద్ధం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook