8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్ప్రైజ్.. కొత్త పేకమిషన్ ఏర్పాటుపై ప్రతిపాదన.. బేసిక్ పే ఎంతంటే..?
8th Pay Commission Latest News: కొత్త పేకమిషన్ ఏర్పాటు ప్రతిపాదనపై కదలిక వచ్చింది. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. త్వరలోనే మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
8th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుడ్‌న్యూస్ త్వరలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా మోదీ ప్రభుత్వానికి పంపించారు. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని.. వేతనాలు, అలవెన్సుల సవరణలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాశారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. దాదాపు 49 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జీతాలు చెల్లిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Amaravati: విధ్వంస రాజధాని అమరావతికి రేపు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే
గత నెలలో డీఏను 4 శాతం పెంచడంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం.. డీఏ 50 శాతానికి చేరితే డీఏను మొత్తం బేసిక్ పేలో కలిపేసి మళ్లీ కొత్త జీరో నుంచి లెక్కించాలి. అంతేకాకుండా కొత్త పే కమిషన్ ఏర్పాటు చేసి.. ఆ కమిటీ సిఫార్సుల మేరకు జీతాలు చెల్లించాలి. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత కొంతకాలంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ప్రస్తుతం కేంద్రంలో మోదీ 3.0 పరిపాలన మొదలవ్వడంతో కొత్త పే కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగులు ఆశతో ఉన్నారు.
ప్రతి పదేళ్లకు ఒకసారి కొత్త పే కమిషన్ ఏర్పాటవుతుంది. 2013లో 7వ వేతన సంఘం ఏర్పాటుగా.. సిఫార్సులు 2016లో అమలులోకి వచ్చింది. 8వ వేతన సంఘం ఇప్పుడు ఏర్పాటు చేసినా.. 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త పే కమిషన్ సిఫార్సులను సమర్పించడానికి ఒక సంవత్సరం నుంచి 18 నెలల వరకు సమయం పడుతుంది.
వేతన సంఘం సిఫార్సు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. ఒకవేళ 8వ వేతన సంఘం సిఫారసుల కోసం ఏర్పాటు చేస్తే.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.68 రెట్లు సెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పే రూ.18 వేలు ఉంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.68 రెట్లు అయితే.. బేసిక్ పే రూ.26 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. గతంలో 5వ సీపీసీ సమయంలో కమిషన్ సిఫార్సుల అమలు కోసం ఉద్యోగులు 19 నెలలు, 6వ సీపీసీ అమలుకు 32 నెలలు సమయం పట్టింది.
Also Read: Sexual Assault: పోర్న్ చూస్తూ సొంత బిడ్డపై తండ్రి లైంగిక దాడి.. నాన్న అనే పేరుకే కళంకం వీడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter