Update on 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది రెండో డీఏ పెంపు జూలై నుంచి వర్తంచనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి డీఏ పెంపు ఉద్యోగుల ఖాతాలో జమ చేయనుంది. చివరగా ఈ ఏడాది మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచిన విషయం తెలిసిందే. పెంచిన డీఏ జనవరి 1వ తేదీ నుంచి అమలు చేసింది. అదేవిధంగా ఏప్రిల్ 1 నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీఏను పెంచుతూ ఉద్యోగులకు శుభవార్తలు అందిస్తున్నాయి. గత రెండు నెలల్లో డీఏను ఏయే రాష్ట్రాలు పెంచాయి..? ఎంత పెంచాయి..? వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటకలో 4 శాతం పెంపు


కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వారం రోజుల్లోనే ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చింది. నాలుగు శాతం డీఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో 31 శాతం నుంచి 35 శాతానికి పెరిగింది. కొత్త డీఏను జనవరి 1వ తేదీ నుంచి అమలు చేసింది. అదేవిధంగా పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) రేటును 31 శాతం నుంచి 35 శాతానికి పెంచింది.


యూపీలో డీఏ పెంపు


ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం గత నెలలో లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 4 శాతం డీఏలను పెంచాలని నిర్ణయించింది. జనవరి 1 నుంచి పెంచిన డీఏ అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం యూపీ ఉద్యోగులకు 38 శాతం నుంచి 42 శాతానికి డీఏ, డీఆర్ పెరిగాయి.


Also Read: TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు.. పెండింగ్ డీఏకు గ్రీన్ సిగ్నల్


తమిళనాడులో 4 శాతం పెంపు


తమిళనాడు  రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 4 శాతం డీఏ, డీఆర్ పెంపునకు ఆమోదం తెలిపింది. పెంచిన డీఏ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్నట్లు వెల్లడించింది. డీఏ 38 శాతం నుంచి 42 శాతానికి చేరింది.


హర్యానాలో ఇలా..


ఏప్రిల్ నెలలోనే రాష్ట్ర ఉద్యోగులకు హర్యానా ప్రభుత్వం డీఏ పెంపు ప్రకటన చేసింది. హర్యానాలోని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 38 శాతం నుంచి 42 శాతానికి పెంచింది.  


హిమాచల్,  జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఇలా..


హిమాచల్ ప్రదేశ్‌, జార్ఖండ్ ప్రభుత్వాలు కూడా ఏప్రిల్‌లో డీఏ పెంపును ప్రకటించాయి. జార్ఖండ్ ప్రభుత్వం 34 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం డీఏను 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో 31 శాతం నుంచి 34 శాతానికి పెరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పెంచిన డీఏ జనవరి 1వ తేదీ నుంచి వర్తింపజేశాయి. 


గుజరాత్‌లో భారీగా పెంపు


గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సర్కారు అదిరిపోయే వార్త చెప్పింది.  రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు 8 శాతం పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. అయితే ప్రభుత్వం పెంచిన 8 శాతం డీఏను రెండు భాగాలుగా అమలు చేయనున్నారు. మొదటి నాలుగు శాతం డీఏ గతేదాడి జూలై 1 నుంచి అమలు చేయగా.. మిగిలిన 4 శాతం పెరిగిన డీఏ జనవరి 1 నుంచి వర్తిస్తుంది.


Also Read: Telangana- Andhra Super fast Railway: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. ఈ మార్గాల్లో రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి