8th Pay Commission Budget 2023: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై సామాన్యులతో పాటు ఉద్యోగులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. డీఏ పెంపు ప్రకటన, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపు, పెండింగ్‌ డీఏపై కీలక నిర్ణయాలు వెలువడుతాయని నమ్మకంతో ఉన్నారు. అంతేకాకుండా పే కమిషన్‌కు సంబంధించిన ప్రకటన కూడా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈసారి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం 8వ పే కమిషన్‌ను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7వ వేతన సంఘం నిబంధనలను 8వ వేతన సంఘంతో భర్తీ చేయాలనే డిమాండ్ గత కొంతకాలంగా ఉద్యోగుల నుంచి వస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. బడ్జెట్‌లో 8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. ఈ భారీ ప్రకటనపై కేంద్ర ఉద్యోగుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ప్రకటిస్తే కేంద్ర ఉద్యోగులకు అత్యల్ప స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు వేతన స్కేలులో గణనీయమైన పెంపుదల ఉంటుంది. కొత్త పే కమీషన్ వైపు వెళితే.. ఉద్యోగుల బేసిక్ పే, పే స్కేల్‌తో పాటు అలవెన్సులు కూడా పెరగనున్నాయి. భవిష్యత్తులో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ బూస్ట్ పొందడానికి కూడా అర్హులు అవుతారు.


కేంద్ర ప్రభుత్వ ఉద్యగులకు సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ నియమాలు అప్‌గ్రేడ్ అవుతాయి. చివరగా 2016లో అప్‌గ్రేడ్ అయింది. అయితే ఈ ఏడాది 8వ వేతన సంఘాన్ని ప్రకటించి.. 2026 నాటికి దాని సిఫార్సులను అమలు చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఈసారి మూడు ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. డీఏ పెంపు ప్రకటన చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులు 38 శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ని పొందుతున్నారు. ఇది 41 లేదా 42 శాతానికి పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కూడా పెంచాలని ఉద్యోగుల ప్రధాన డిమాండ్. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై కేంద్ర నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల జీతాలు భారీగా పెరుగుతాయి. ప్రస్తుతం ఉన్న 2.57 నుంచి 3.68 శాతానికి పెంచాలని కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు చాలాకాలంగా కేంద్ర పెద్దలను అడుగుతున్నారు. కరోనా సమయంలో 18 నెలల డీఏ చెల్లింపును ప్రభుత్వం నిలిపివేసింది. తమకు బకాయి ఉన్న డీఏను చెల్లించాలని కోరుతున్నారు. పెండింగ్ డీఏ బకాయిలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే.. ఉద్యోగుల ఖాతాలో ఒకేసారి భారీగా నగదు జమకానుంది.


Also Read: Budget 2023: వ్యాపారులకు పెన్షన్ స్కీమ్.. బడ్జెట్‌లో ప్రధాన డిమాండ్స్ ఇవే..  


Also Read: Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ బాల్.. బ్యాట్స్‌మెన్ దిమ్మతిరిగింది  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి


Pakistan ExplosionPakistan