7th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా రెండు సార్లు డీఏ పెంచుతుంటుంది. ఈ ఏడాది జూలైలో పెరగాల్సిన డీఏపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. కచ్చితంగా ఎప్పుడనే విషయంపై ఇంకా స్పష్టత లేకపోయినా ఈసారి అంతగా నిరీక్షించే అవసరం ఉండదని మాత్రం తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 4 శాతం పెరిగింది. జూలైలో సీపీఐ 15 నెలల గరిష్టానికి చేరుకోవడంతో ప్రభుత్వం ఈసారి డీఏను 3 శాతం పెంచవచ్చని తెలుస్తోంది. ఈసారి డీఏ కచ్చితంగా ఏ తేదీన పెంచుతారనేది ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. కానీ గతంలో ఉన్నట్టు ఎక్కువ నిరీక్షణ ఉండకపోవచ్చు. ఈ ఏడాది అంటే 2023లో జనవరి నెలలో మొదటి డీఏ పెంపు జరిగింది. ఇప్పుడిక రెండవది జూలైలో జరగాల్సింది ఉంది.  ప్రతి నెలా కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా డీఏ ఎంతనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 


జూలై 2023 నుంచి పెరగాల్సిన డీఏను అక్టోబర్‌లో అందించవచ్చనే వార్తలు విన్పిస్తున్నాయి. కానీ అంత వరకూ నిరీక్షించాల్సిన అవసరం లేకుండా సెప్టెంబర్ నెలలలోనే డీఏ పెంపుపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవచ్చు. ఇటీవల అంటే 2023 జనవరిలో పెరిగిన 4 శాతం డీఏ పెంపుతో ప్రస్తుతం 42 శాతం డీఏ అందుతోంది. ఇప్పుడు మరో 3 శాతం పెరిగే అవకాశాలు కన్పిస్తుండటంతో మొత్తం డీఏ 45 శాతానికి చేరుకోవచ్చు. 


డీఏ అనేది ద్రవ్యోల్బణం ఆధారంగా ఇస్తుంటారు. ద్రవ్యోల్బణం పెరిగితే డీఏ పెరుగుతుంటుంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తక్కువ డీఏ ప్రకటిస్తే ఇది నిరుపయోగమౌతుంది. ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం డీఏ ఈసారి 3 శాతం కాకుండా 4 శాతం ఉండాలనే డిమాండ్ వస్తోంది. ఏఐసీపీఐ ఇండెక్స్ తాజాగా 136.4 పాయింట్లకు చేరుకుంది. మే నెలలో ఇది 134.7 పాయింట్ల ఉంది. దీని ఆధారంగా డీఏ లెక్కేస్తే డీఏ 46.24 శాతానికి చేరుకోవాలి. అంటే డీఏ 46 శాతం అవుతుంది. ఈ లెక్కన ఈసారి పెంచనున్న డీఏ 4 శాతం ఉండాలనే వాదన అందుకే విన్పిస్తోంది.


కేంద్ర ఆర్ధిక శాఖ ఖర్చుల విభాగం దీనికి సంబంధించిన ప్రతిపాదనను పంపించనుంది. డీఏ పెంపు ద్వారా ఎదురయ్యే ఆర్దిక భాగం ఎంతనే వివరాలతో ఈ ప్రతిపాదన ఉంటుంది. కేబినెట్‌లో ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనున్నారు. 


Also read: Aditya L1 Launch Date: ఇప్పుడిక సూర్యయానం, ప్రతిష్టాత్మక ఆదిత్య ఎల్1 లాంచ్ తేదీ ప్రకటించిన ఇస్రో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook