7th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 18 లోక్‌సభకు కేంద్ర ఎన్నికల కమిషన్ 7 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ రోజుతో 7వ విడత ఎన్నికలు జరగుతున్నాయి. దీంతో మొత్తంగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. ఈ సారి ఎన్నికల్లో ప్రధాన మంత్రి బరిలో ఉన్న వారణాసి నియోజకవర్గం ఉంది. ఈ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌కు ఏడు విడతల్లో ఎన్నికలు జరగడం విశేషం. ఈ రాష్ట్రాల్లో నక్సల్స్‌తో పాటు సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడం విశేషం. చివరి విడత ఎన్నికల్లో బిహార్ రాష్ట్రంలోని మిగిలిన 8 లోక్ సభ సీట్లతో పాటు.. పశ్చిమ బెంగాల్‌లోని 9 సీట్లతో పాటు. .ఉత్తర ప్రదేశ్‌లోని 13 పార్లమెంట్ స్థానాలు.. ఒడిషాలోని 6 లోక్ సభ సీట్లతో పాటు.. 42 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి. అటు జార్ఖండ్‌లోని 3.. పంజాబ్‌లోని 13 స్థానాలు.. హిమాచల్ ప్రదేశ్‌లోని 4 స్థానాలతో పాటు చండీఘర్ స్థానానికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తంగా 542 లోక్ సభ స్థానాలకు ఈ నెల 4వ తేదిన ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. మొత్తంగా ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో దాదాపు 93 కోట్ల మంది ప్రజల్లో దాదాపు 70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం.


జూన్ 1 జరిగే ఎన్నికలతో దేశ వ్యాప్తంగా 543 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. ఇందులో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ స్థానం ఏకగ్రీవం కావడంతో 542 లోక్ సభ సీట్ల ఫలితాలను జూన్ 4న ప్రకటించనుంది ఎన్నికల కమిషన్. మొత్తంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ శనివారంతో ఎన్నికల క్రతువు పూర్తవుతోంది. 18వ లోక్ సభకు జరిగిన ఈ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన పార్టీ అభ్యర్ధి ప్రధాన మంత్రిగా నియమితులువుతారు. మొత్తంగా ఏప్రిల్ 19వ తేదిన ప్రారంభమైన మొదట దశ పోలింగ్.. జూన్ 1 జరిగే ఏడో విడత పోలింగ్‌తో మొత్తం 542 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి.


మొత్తంగా మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి నేటితో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. మొత్తంగా ఏప్రిల్ 19న మొదటి దశలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తంగా మొదటి దశలో 102 లోక్‌సభ స్థానాలతో మొదలైన ఎన్నికల ప్రక్రియ నేడు జరగుతున్న 57 స్థానాలతో మొత్తంగా అన్ని స్థానాలకు ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచే పార్టీ అభ్యర్ధి భావి భారత ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మరి జూన్ 4న జరిగే ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీని ప్రజలు గెలిపిస్తారనేది చూడాలి.


Also Read: Kavya Maran Love Story: ఎస్ఆర్‌హెచ్‌ యంగ్ ప్లేయర్‌తో కావ్య మారన్ డేటింగ్.. ఆ క్రికెటర్ ఎవరంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter