Uttar Pradesh Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కారు-ట్రక్కు  ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి చిన్నారి సహా  ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం బరేలీ నేషనల్ హైవేపై జరిగింది. కారు టైర్ పంక్చర్ కావడం వల్ల వాహనం అదుపుతప్పి రోడ్డుకు అవతలి వైపుకు వెళ్లి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదం బరేలీ-నైనిటాల్ రోడ్డులోని దుబౌరా గ్రామ సమీపంలో శనివారం అర్థరాత్రి జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి కారులో మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసు సూపరింటెండెంట్ సుశీల్ చంద్రభాన్ తెలిపారు. వీరంతా ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ట్రక్కు డ్రైవర్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు  తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Also Read: Onion Exports ban: ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం.. కారణం ఇదే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి