Onion Exports ban: దేశంలో ఉల్లి ధరలు (Onion Prices) చుక్కలు చూపిస్తున్నాయి. మార్కెట్లో కిలో ఉల్లి రూ.50పైనే పలుకుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతుల (Onion Exports)పై నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉల్లి లభ్యతను పెంచడంతోపాటు ధరలను అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ బ్యాన్ శుక్రవారం (డిసెంబరు 8 )నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అయితే కొన్ని మినహాయింపులను కూడా ఇచ్చింది. ఈ నోటిఫికేషన్‌కు ముందే ఓడల్లో లోడ్ అయిన ఉల్లిని, ఇప్పటికే కస్టమ్స్‌కు అప్పగించిన ఉల్లి లోడ్‌ను ఎగుమతి చేసుకోవచ్చని డీజీఎఫ్టీ పేర్కొంది.
మహారాష్ట్రలో అకాల వర్షాల వల్ల పంట దెబ్బతినడంతో టోకు వ్యాపారంలో దేశీయ ధరలు కిలోకు రూ. 40కి పెరిగినందున మార్చి 31, 2024 వరకు భారతదేశం ఉల్లిపాయల ఎగుమతిని నిషేధించింది. ఈ చర్య వల్ల జనవరిలో ఉల్లి ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉందని వ్యాపారులు, రైతులు అంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు ఉల్లి ఎగుమతులపై టన్నుకు 800 డాలర్ల కనీస ఎగుమతి ధర (MEP)ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తాజాగా ఎగుమతులపై నిషేధం అమల్లోకి తెచ్చింది. ఒక వేళ ఇతర దేశాల అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం అనుమతిస్తే.. ఆయా దేశాలకు ఎగుమతులు చేసుకోవచ్చని DGFT స్పష్టం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook