8th Pay Commission: న్యూ ఇయర్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు భారీగా పెరిగే ఛాన్స్..!
8th Pay Commission Latest Update: వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్ పే కమిషన్‌ను తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కొత్త ఫార్ములా ప్రకారం జీతాలు చెల్లించే అవకాశం ఉంది.
8th Pay Commission Latest Update: కొత్త ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం 7వ వేతన సంఘం అమలులో ఉండగా.. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది కొత్త కమిషన్ తీసుకురానుందని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కీలక ప్రకటన వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 8వ వేతన సంఘం అమలు కోసం ఢిల్లీలో ఉద్యోగులు, పెన్షనర్ల ఉద్యమం చేస్తున్నారు. కొత్త వేతన సంఘంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని గత నెల రోజుల్లో వరుసగా రెండోసారి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కేంద్ర ఉద్యోగుల కనీస వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
అయితే ఇప్పటివరకు 8వ వేతన సంఘం రాదనే చర్చ జరిగింది. కానీ లోక్‌సభ ఎన్నికల తరుణంలో వేతన కమిషన్‌కు సన్నాహాలు జరుగుతున్నాయని భావిస్తున్నారు. దీనిపై కేంద్రం దృష్టి సారిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్త వేతన సంఘం అమలు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం అమలు తర్వాత ఉద్యోగులు భారీ ప్రయోజనాలను పొందవచ్చు. పే కమిషన్ కోసం ఎలాంటి ప్యానెల్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా ప్రకటించే ఛాన్స్ ఉంది. బదులుగా వేతన సంఘంలోనే వేతన సవరణకు కొత్త ఫార్ములా ప్రకారం జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి డీఏ 50 శాతం దాటితే కొత్త పే కమిషన్ అమలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం డీఏ 46 శాతం ఉంది. జనవరిలో 4 శాతం పెరిగితే.. 50 శాతానికి చేరుకుంటుంది. ఈ మొత్తాన్ని బేసిక్ శాలరీలో కలిపేసి.. జీరో నుంచి డీఏను లెక్కించాల్సి ఉంటుంది. 8వ పే కమిషన్‌ను 2024 సంవత్సరంలో ఏర్పాటు చేస్తే.. ఒకటిన్నర సంవత్సరాలలోపు అమలులోకి వస్తుంది. 7వ వేతన సంఘంతో పోలిస్తే 8వ వేతన సంఘంలో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌కి సంబంధించి కూడా కొన్ని మార్పులు ఉండవచ్చు. ఇప్పటివరకు ప్రభుత్వం 10 సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.
7వ వేతన సంఘంతో పోలిస్తే 8వ వేతన సంఘంలో ఉద్యోగులు భారీ జీతం అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే ఉద్యోగుల జీతాలు ఒకేసారి భారీ మొత్తం పెరగనున్నాయి. ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.68 రెట్లు పెరగనుంది. అలాగే ఫార్ములా ఏదైనా సరే ఉద్యోగుల బేసిక్ పేలో 44.44% పెరుగుదల ఉండవచ్చు. అందుకే కొత్త పే కమిషన్ అమలు కోసం ఉద్యోగులు పోరాటం చేస్తున్నారు.
Also Read: Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా
Also Read: Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి