8th Pay Commission Updates: 8వ వేతన సంఘంలో ఉద్యోగుల కనీస వేతనం, పెన్షన్ ఎంత ఉంటుందో తెలుసా
8th Pay Commission Updates in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వం త్వరలో 8వ వేతన సంఘం ఏర్పాటు చేయనుంది. 8వ వేతన సంఘం ఏర్పాటైతే ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్ల పెన్షన్ మారుతుంది. అదే జరిగితే పెన్షన్ ఎంత ఉంటుందనేది పరిశీలిద్దాం.
8th Pay Commission Updates in Telugu: కేంద్ర ప్రభుత్వం ఇటీవల యూనిపైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్‌కు ఇది ప్రత్యామ్నాయం. ఏప్రిల్ 1వ తేదీ 2025 నుంచి అమలు కానుంది. వాస్తవానికి ఎన్‌పీఎస్‌కు పూర్వం అమల్లో ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ రద్దు చేసి ఆ స్థానంలో ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ పునరుద్ధరించాలని పలు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే ఓపీఎస్‌లో ఉన్నట్టే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్‌లో కూడా రిటైర్మెంట్‌కు ముదు 12 నెలల నుంచి ఉన్న కనీస వేతనంలో 50 శాతం పెన్షన్‌గా చెల్లిస్తారు. ఇది కాకుండా కనీసం 10 వేల రూపాయలు మినిమమ్ పెన్షన్ గ్యారంటీ ఉంటుంది. ఇది పదేళ్ల సర్వీసు ఉన్నవారికి వర్తిస్తుంది. పెన్షనర్ చనిపోతే భార్యకు 60 శాతం పెన్షన్ అందుతుంది. పూర్తి స్థాయిలో పెన్షన్ అర్హత ఉండాలంటే ఉద్యోగి కనీసం 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుండాలి. 25 ఏళ్ల కంటే తక్కువ సర్వీసు ఉంటే పెన్షన్ ప్రో రేటా ఆధారంగా అందిస్తారు.
8వ వేతన సంఘంలో పెన్షన్ ఎంత ఉంటుంది
ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘంలో కనీస పెన్షన్ 9 వేల రూపాయలు అందుతోంది. ఇది 18 వేలు కనీస వేతనం ఉన్నవారికి లభిస్తున్నపెన్షన్. 8వ వేతన సంఘం ఏర్పాటైతే 2026 నుంచి అమలయ్యే కొత్త వేతనంలో కనీస వేతనం 34,560 రూపాయలకు పెరగవచ్చు. అంటే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92 శాతం ఉండవచ్చని అంచనా. దీని ప్రకారం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌లో 25 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నవారికి పెన్షన్ 17,280 రూపాయలు రావచ్చు. పెన్షన్ అనేది గత 12 నెలల సరాసరి కనీస వేతనంపై ఆధారపడి ఉంటుంది. డీఏ మెర్షర్ వంటి అడ్జస్ట్‌మెంట్‌ల కారణంగా కనీస వేతనంలో ఏమైనా మార్పులుంటే అవి కూడా పరిగణలో తీసుకుంటారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లో రానుంది. ప్రస్తుత నేషనల్ పెన్షన్ సిస్టమ్ లబ్దిదారులకు అందులో మారేందుకు ఆప్షన్ ఉంటుంది. కేంద్ర కేబినెట్ ఇప్పటికే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ను ఆమోదించింది. 50 శాతం పెన్షన్ అనేది ఇందులో మొదటి ప్రాధాన్యత. రెండవది. కుటుంబానికి అందే పెన్షన్. మొత్తానికి 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం కనీసం 17,560 రూపాయలు పెన్షన్ ఉంటుంది.
Also read: MG Windsor EV launch: ఫ్లైట్ ఫీచర్లతో మతి పోగొడుతున్న MG Windsor EV ధర ఇతర ఫీచర్లు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.