8th pay commission Latest update: జాగా కేంద్ర కార్మిక సంఘాలలో ఒకటైన ఏఐటీయూసీ.. వినియోగదారుల ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని,  వేతన సవరణ ప్రక్రియను చేపట్టేందుకు పే ప్యానల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అలాగే బత్యాల సవరణ కోసం ఎనిమిదవ వేతన సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్.. ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏఐటియుసి ప్రధానమంత్రిని కోరుతూ.. నిత్యవసర వస్తువుల ధరలు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి.  నేటి జీవన ప్రమాణాల అవసరాన్ని పరిగణలోకి తీసుకొని తక్షణమే ఎనిమిదవ కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలి అంటూ ఆగస్టు 24వ తేదీన విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరింది. ముఖ్యంగా పే కమిషన్లు 10 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడతాయని అందరికీ తెలిసిందే.  ఏడవ వేతన సంఘంగా ఉన్న మునుపటి పే ప్యానెల్ ఫిబ్రవరి 2014లో ఏర్పాటయింది. అలాగే అందుకు సంబంధించిన..సిఫార్సులు జనవరి 1 2026 నుండి అమలు చేయబడ్డాయి 


దీనికి తోడు ఈ  వారం ప్రారంభంలో రైల్వే ఉద్యోగులు.. పెన్షనర్ల ను గుర్తించి యూనియన్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్ కూడా.. ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాదు ఎన్ ఎఫ్ ఐ ఆర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి, వివరణాత్మక ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోడీ ముందు ఇప్పటికే సమర్పించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనాలను దాదాపు ఎనిమిదిన్నర  సంవత్సరాల క్రితం సవరించారు అంటూ తెలిపింది.


ఇకపోతే తన ప్రతిపాదన ద్వారా డాక్టర్ అక్రోయిడ్ ఫార్ములా ఆధారంగా కనీస వేతనాన్ని నెలకు రూ.32,500 గా సవరించాలని తెలిపింది. అయితే ఈ విషయంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ గత నెలలో లోక్సభ , రాజ్యసభల ముందు లిఖితపూర్వక సమాధానాలలో స్పష్టం చేసింది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏది ప్రభుత్వ పరిశీలనలో లేదని.. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే.. ఉద్యోగస్తుల వేతనం ఇప్పట్లో సవరించే అవకాశం లేదు అన్నట్లు తెలుస్తోంది.


Also Read: Big Shock To YSRCP: జగన్‌కు షాక్‌ల మీద షాక్‌.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా


Also Read: Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook