2016 నవంబర్ రాత్రికి రాత్రి రద్దైన పాత రూ.500, రూ.1000 నోట్లలో 99.3 శాతం కరెన్సీ బ్యాంకులకు తిరిగొచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన వార్షిక నివేదికలో పేర్కొంది. 2016 నవంబర్ 8 ముందువరకు దేశంలో రూ.15.41 లక్షల కోట్ల రూ.500, రూ.1000 నోట్లు చెలామణిలో ఉండేవని, ప్రధాని నోట్ల రద్దు ప్రకటన తర్వాత.. రూ.15.31 లక్షల కోట్ల విలువైన కరెన్సీ బ్యాంకులకు  చేరుకుందని తెలిపింది. రద్దయిన పాత నోట్ల ప్రాసెసింగ్‌, వెరిఫికేషన్ ప్రకియ విజయవంతంగా పూర్తయిందని నివేదికలో పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంకులకు వచ్చిన స్పెసిఫైడ్‌ బ్యాంక్‌ నోట్ల (ఎస్‌బీఎన్‌)ను హైస్పీడ్‌ కరెన్సీ వెరిఫికేషన్‌ ప్రాసెసింగ్‌ వ్యవస్థ (సీవీపీఎస్‌)లో  లెక్కింపు, తనిఖీ ప్రక్రియ పూర్తయిందని ఆర్‌బీఐ పేర్కొంది. ఎస్‌బీఎన్‌లు పాత 500, 1,000 రూపాయలను సూచిస్తాయి.


'ఎస్‌బీఎన్‌ల ప్రాసెసింగ్ పూర్తయింది. సర్క్యులేషన్ నుండి తిరిగి వచ్చిన మొత్తం ఎస్‌బీఎన్‌లు రూ.15,310.73 బిలియన్లు.' అని ఆర్బీఐ స్పష్టం చేసింది.