జేఎన్‌యూ విద్యార్ధి నాయకురాలు షెహ్లా రషీద్‌  వివాదాస్పద ట్వీట్ చేసింది . ప్రస్తుతం ఈ ట్వీట్ కు పలవురు కౌంటర్లు ఇస్తుండగా..మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. చివరకు ఈ ట్వీట్ ఎఫెక్ట్ కేంద్ర మంత్రి గడ్కరీకి తగిలింది. ఈ క్రమంలో ఆయన హాట్ గా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఏంటా ట్వీట్. ఎవరి గురించి అనుకుంటున్నారా.. తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షెహ్లా రషీద్‌ వివాదాస్పద ట్వీట్...
 


'మోదీ హత్యకు ఆర్ఎస్ఎస్/గడ్కరీ కుట్ర'  ప్లాన్ చేస్తురన్నారని తనకు అనిపిస్తోందని ట్వీట్ చేసిన షెహ్లా రహీద్... ఆ నిందను ముస్లింలు, కమ్యూనిస్టులపై వేసి ముస్లింలను ఊచకోత కోస్తారేమోనన్న అనుమానం వ్యక్తం చేసింది. 



కేంద్ర మంత్రి గడ్కారీ వార్నింగ్ 


సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ట్వీట్ పై తీవ్రంగా ఖండించిన  కేంద్ర మంత్రి గడ్కరీ... వార్నింగ్ రిప్లై ఇచ్చారు.  జేఎన్‌యూ విద్యార్ధి నాయకురాలు చేసిన ఈ సామాజిక వ్యతిరేక వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నానని రీ ట్వీట్‌ చేశారు.




 




ఈ ట్వీట్ వెనుక ఎవరున్నారు ?


ప్రధాని మోడీ  మోదీ హత్యకు మావోయిస్టులు స్కెచ్ వేశారని ఇటీవలే మహారాష్ట్రలోని పుణే పోలీసులు చేసిన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై అనుమానాలు వ్యక్తం చేసిన ప్రతిపక్ష నేతలు .. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జనాల్లో  సానుభూతి పొందాలనే మోదీ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో ప్రణబ్ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోందని శివసేన నేత రౌత్ సంచలన ప్రకటన చేయడం వంటి పరిణామాల నడుస్తున్న తరుణంలో  మోదీ హత్యకు కుట్ర జరుగుతోందని విద్యార్థి నేత చేయడం ట్వీట్ గమనార్హం. కాగా ఈ ట్వీట్ వెనక దుష్టశక్తులున్నాయని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.