న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. నిర్భయ కేసులో దోషులకు జనవరి 22న మరణశిక్ష అమలు చేయడం లేదు. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీ కోర్టు మరో డెత్ వారెంట్ జారీ చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నిర్భయ కేసులో దోషి ముకేశ్ సింగ్ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన అనంతరం.. మరో డెత్ వారెంట్ జారెంట్ చేయాలని తిహార్ జైలు అధికారులు ఢిల్లీ హైకోర్టును కోరారు. ముఖేష్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ ఠాకూర్‌ (31)లకు ఉరిశిక్ష ముకేశ్ కోరినట్లుగానే వాయిదా పడటం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేటి ఉదయం నిర్భయ కేసులో దోషి ముకేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. గురువారం (జనవరి 16) రాత్రి ముకేశ్ పిటిషన్‌ను రాష్ట్రపతి భవన్‌కు కేంద్ర హోం మంత్రిత్వశాఖ పంపించింది. క్షమాభిక్ష తిరస్కరించాలని సైతం రాష్ట్రపతికి హోంశాఖ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో నేడు (జనవరి 17న) క్షమాభిక్ష పిటిషన్‌ను కోవింద్ తిరస్కరించారు. ఈ విషయాన్ని హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఉరిశిక్ష అమలయ్యే తిహార్ జైలు అధికారులకు సైతం సమాచారాన్ని చేరవేశారు.



Also Read: నిర్భయ దోషికి క్షమాభిక్ష తిరస్కరించిన రాష్ట్రపతి కోవింద్.. తర్వాత ఏంటి?


కాగా, జనవరి 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ కొన్ని రోజుల కిందట ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు దోషులు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేసుకోగా ఎన్వీ రమణ ధర్మాసనం వాటిని తిరస్కరించింది. అనంతరం దోషుల్లో ఒకడైన ముకేశ్ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. తొలుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌, ఆపై కేంద్ర హోంశాఖ ముకేశ్ పిటిషన్‌ను తిరస్కరించగా.. తాజాగా రాష్ట్రపతి సైతం నిర్భయ నిందితుడికి క్షమాభిక్షను ప్రసాదించలేదు. అయితే చట్టపరమైన కారణాలతో ఉరిశిక్ష ఫిబ్రవరి 1కి వాయిదా పడింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..