Helicopter: పొలానికి వెళ్లేందుకు ఓ వృద్ధురాలు హెలీకాప్టర్ కొనాలనుకుంది. దానికోసం లోన్ ఇప్పించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాసి సంచలనమైంది. ఇప్పుడదే కోవలో పాలమ్మడానికి ఏకంగా హెలీకాప్టర్ కొనుగోలు చేశాడు ఓ వ్యక్తి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అతడో బడా రైతు. కేవలం రైతే కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. కొత్తగా పాల వ్యాపారంలో అడుగుపెట్టాడు. ఇతని పేరు జనార్ధన్ భోయిర్. మహారాష్ట్ర ( Maharashtra )లోని భివాండికు చెందినవాడు. పాల వ్యాపారంలో అడుగుపెట్టడంతో వ్యాపారాభివృద్ధి కోసం పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్‌లోని పలు ప్రాంతాలకు తరచూ వెళ్లాల్సి వచ్చేది. ఆ రూట్‌లో  ఎయిర్‌పోర్ట్ లేకపోవడంతో రైళ్లు, బస్సుల్లో వెళ్తుండేవాడు. ఫలితంగా సమయం ఎక్కువగా వృధా అయ్యేది. దాంతో స్నేహితుడు సలహా మేరకు ఏకంగా 30 కోట్లు వెచ్చించి హెలీకాప్టర్ కొనుగోలు చేశాడు.


ఇందులో భాగంగా ఇప్పటికే హెలీకాప్టర్ ( Helicopter ) గ్రామానికి తీసుకొచ్చి ట్రయల్ కూడా వేశారు. 2.5 ఎకరాల స్థలంలో హెలీకాప్టర్ కోసం ప్రొటెక్షివ్ వాల్‌ను కూడా నిర్మించుకున్నాడు. మార్చ్ 15న కొత్త హెలీకాప్టర్ డెలివరీ కానుంది. వ్యవసాయం, రియల్ ఎస్టేట్, పాల వ్యాపారమే కాకుండా జనార్ధన్‌కు వంద కోట్ల విలువైన ఆస్థులు కూడా ఉన్నాయని సమాచారం. పొలానికి వెళ్లేందుకు హెలీకాప్టర్ కొనుగోలు చేసుకుంటాను, లోన్ ఇప్పించమని రాష్ట్రపతికి ఓ మహిళ లేఖ రాసిన ఘటన మర్చిపోకముందే..ఏకంగా పాలమ్ముకోడానికి హెలికాప్టర్ కొనుగోలు చేసి సంచలనం రేపాడితడు.


Also read: EPFO ఖాతాదారులకు Bad news.. PF interest rates తగ్గే అవకాశం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook