సూరత్: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కొర్పొరేషన్ (ONGC) ప్లాంటులో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. గుజరాత్, సూరత్ లోని హజిరా ప్లాంటులో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హజిరా ప్లాంటులో మూడు వరుస పేలుళ్లు సంభవించాయని, దాంతో భారీ అగ్నిప్రమాదం (Surat Fire Accident) సంభవించి మంటలు వ్యాప్తి చెందాయని ఓఎన్‌జీసీ అధికారి డాక్టర్ ధవల్ పటేల్ తెలిపారు. 



ఒక్కసారిగా భారీ శబ్ధాలతో పేలుళ్లు సంభవించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఘటనా స్థలానికి చేరుకుంది. కొన్ని కిలోమీటర్ల మేర అగ్ని ప్రమాదం సంభవించినట్లు సమాచారం. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇప్పటివరకే ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారి పటేల్ వెల్లడించారు. MI vs KKR: పాట్ కమిన్స్‌కు మద్దతుగా నిలిచిన కెప్టెన్ దినేష్ కార్తీక్  


 



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe