మహారాష్ట్ర: పులి దాడిలో అటవీశాఖ మహిళా ఉద్యోగి మృతి
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. పులి దాడిలో అటవీశాఖ మహిళా ఉద్యోగిని మృతి చెందింది. ఈ ఘటన చంద్రాపూర్ జిల్లాలోని తాడోబా అభయారణ్యంలో జరిగింది.
Tiger Attack: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా(Chandrapur District)లో ఘోరం జరిగింది. పులులను లెక్కించడానికి తడోబా అభయారణ్యానికి(Tadoba Forest) వెళ్లిన అటవీశాఖ మహిళా ఉద్యోగి(Woman Officer)పై పులి దాడి చేసి చంపేసింది. శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read: దారుణం: మత్తుమందు ఇచ్చి.. మర్మాంగాన్ని కోసేసింది..!
వివరాల్లోకి వెళితే..
తడోబా అభయారణ్యం(Tadoba Forest)లో గత కొద్ది రోజులుగా అటవీశాఖ అధికారులు పులుల గణన చేపట్టారు. ఈ క్రమంలో శనివారం కొంతమంది అటవీశాఖ సిబ్బంది, అటవీ కూలీలు కోలారా గేట్ వద్ద ఉన్న 97వ కోర్ జోన్‌కు వెళ్లారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఓ పులి(Tiger Attack) వారిపై దాడి చేసింది. అటవీశాఖ మహిళా ఉద్యోగి స్వాతి ధోమనే(43)పై దాడి చేసి ఆమెను పొదల్లోకి లాక్కెళ్లింది.
అటవీ శాఖ కూలీలు వెంబడించినప్పటికీ పులి ఆమెను వదిలిపెట్టలేదు. సమాచారమందుకున్న తడోబా మేనేజ్‌మెంట్ అధికారి, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. అభయారణ్యంలోని దట్టమైన పొదల ప్రాంతంలో స్వాతి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. దీంతో మిగతా అధికారులు అప్రమత్తమై వెనుతిరిగారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook