Aadhaar Card Mobile Number: నిత్య జీవితంలో అత్యంత ప్రామాణికంగా మారింది ఆధార్ కార్డు. అందుకే ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు ఫోన్ నెంబర్ వివరాల్ని అప్‌డేట్‌గా ఉంచుకోవాలి. ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చాలుకుంటే చాలా సులభం కూడా. అదెలాగో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని రకాల ప్రయోజనాలు పొందాలన్నా లేదా మరే ఇతర అవసరానికైనా ఆధార్ కార్డు తప్పనిసరి. అందులోనూ ఆధార్ కార్డుకు మీ మొబైల్ నెంబర్ లింక్ అయుండటం ఇంకా ముఖ్యం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా అంటే యూఐడీఏఐ కీలక సూచనలు జారీ చేస్తోంది. కార్డు హోల్డర్లు తమ తమ వివరాల్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలంటోంది. మీ అడ్రస్ మారినా లేదా ఫోన్ నెంబర్ మారినా లేదా, పుట్టిన తేదీ తప్పుగా ఉన్నా, లేదా మెయిల్ ఐడీ మార్చాలన్నా లేదా ఫోటో సరిగ్గా లేకపోయినా అప్‌డేట్ చేసుకోమంటోంది. సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలంటోంది. 


ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుతో కనెక్ట్ అయుంటే చాలా రకాల సేవల్ని స్వయంగా చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్ నెంబర్ మార్చాలన్నా లేదా లింక్ అయి లేకపోయినా వెంటనే అప్‌డేట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే చాలా సేవలు ఆధార్‌తో అనుసంధానమై ఉంటున్నాయి.


ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ఎలా మార్చాలి


ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ ask.uidai.gov.in.సందర్శించాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు మార్చాలనుకుంటున్న ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా నమోదు చేయాలి. సెండ్ ఓటీపీ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత కిందకు వెళితే..సబ్మిట్ ఓటీపీ అండ్ ప్రోసిడ్ ఆప్షన్ ఉంటుంది. మీ ఫోన్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఆన్‌లైన్ ఆధార్ సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇందులో ఫోన్ నెంబర్ ఎంచుకోండి. తిరిగి క్యాప్చాతో పాటు ఓటీపీ ఎంటర్ చేయండి. తరువాత సేవ్ అండ్ కంటిన్యూ ప్రెస్ చేయండి. ఇప్పుడు సమీపంలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి..25 రూపాయలు చెల్లించి..మిగిలిన ప్రోసెస్ పూర్తి చేయండి. ఆధార్ కార్డు హోల్డర్లు మీ సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి...కరెక్షన్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది. అక్కడి సిబ్బంది మీ వివరాలు పరిశీలించిన తరువాత..మీకొక ఎక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ అందిస్తారు. అందులో ఉండే యూఆర్ఎన్ ద్వారా మీ అప్‌డేట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.


Also read: EV Charging Stations: దేశంలో ఉన్న మొత్తం ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఎన్నంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook