Aadhaar-voter card link: ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకతను పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్​కు మరిన్ని అధికారాలు ఇచ్చేలా కొత్త చట్టం (Bill on Aadhaar-voter ID linking) తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన బిల్లు నేడు పార్లమెంట్​ ముందుకు రానున్నట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధార్​తో ఓటరు కార్డు అనుసంధానం (Aadhaar link vith Voter card) చేసేందుకు వీలు కల్పించే బిల్లును లోక్​ సభలో సోమవారం ప్రవేశపెట్టనుంది కేంద్రం.


కొత్త చట్టం ఎందుకు?


నకిలీ ఓట్ల సమస్యను పరిష్కరించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానుంది కేంద్రం. దీనితో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి.. ఎన్నికల సంఘానికి (Election Commission of India) మరిన్ని అధికారాలు కట్టబెట్టనుంది.


ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే.. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్​ను కోరనుంది ఎన్నికల కమిషన్​. దీనితో పాటు ఇప్పటికే ఓటు హక్కు ఉన్న వారి నుంచి కూడా ఆధార్​ సేకరించేందుకు వీలుపడనుంది. అయితే వ్యక్తిగత గోప్యతను దృష్టిలో ఉంచుకుని.. ఆధార్-ఓటర్ ఐడీ లింక్ తప్పనిసరి ప్రాతిపదికన కాకుండా.. ఐచ్చికంగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లు పార్లమెంట్​లో (Election Law Amendment Bill 2021) ప్రవేశ పెడితే ఆ వివరాలు బహిర్గతం కానున్నాయి.


ఓటు హక్కు నమోదుకు కార్యక్రమం ఏడాదికి 4 సార్లు..


అర్హులందరికి ఓటు హక్కు కల్పించే ఉద్దేశంతో మరో కీలక అంశం కూడా ఈ బిల్లులో చేర్చింది కేంద్రం. దీని ప్రకారం.. ఏడాదికి నాలుగు సార్లు ఓటు హక్కు నమోదు చేసుకునే వీలు కలగనుంది. ప్రస్తుతం ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ అవకాశం లభిస్తోంది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు నమోదు కోసం ఏడాదికి నాలుగు అవకాశాలు లభించనున్నాయి.


Also read: Video: పెళ్లి కొడుకును చితకబాదిన వధువు కుటుంబం-తీరా పెళ్లి సమయానికి ఆ డిమాండ్ చేయడంతో


Also read: IRCTC update: మహిళల రక్షణకు రైల్వే కీలక నిర్ణయం- ఆ ట్రైన్లలో బెర్త్​లు రిజర్వ్​!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook