న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్ నంబర్లకు ఆధార్ ను తప్పనిసరిగా అనుసంధానిస్తూ ఒక కేసును విచారించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని 'ఆధార్ లింక్' కు వెంటనే తాత్కాలిక ఉపశమనం కోరుతూ న్యాయవాది శ్యామ్ దివాన్ పిటిషన్ దాఖలు చేశారు. 


కేసును పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాక్ మిశ్రా మాట్లాడుతూ, ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును  రేపు(గురువారం) మధ్యాహ్నం రెండు గంటలకు విచారిస్తుందని తెలిపారు. 


అక్టోబర్ 30న, సుప్రీంకోర్టు ఆధార్ కు సంబంధించిన అన్ని కేసులను పరిష్కరించడానికి నవంబర్ చివరినాటికి ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఏర్పాటు కావాలని సూచించింది. కోర్టు నుండి ఆదేశాలు జారీ అయ్యేవరకు, ప్రభుత్వం ఆధార్ ను వివిధ పథకాలకు, కార్యక్రమాలకు అనుసంధానించనుంది. అంతకుముందు కోర్టు ట్యాగ్ చేసిన 22 కేసులను చిన్న బెంచ్ విన్నది.