Arvind Kejriwal: దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు మరోసారి రాజకీయంగా వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా పలువులు ఆప్ నేతలు ఇప్పటికే అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. త్వరలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావచ్చనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఢిల్లీలో సరికొత్త రాజకీయం తెరపైకి రానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ మద్యం స్కాంను రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్నాయి. మద్యం కుంభకోణంలో అవకతవకలు, అవినీతి వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తుంటే..ఇందులో ఇమిడి ఉన్న మనీ లాండరింగ్ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ కేసు తీవ్ర ప్రకంపనలు రేపింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను ఇప్పటికే సీబీఐ, ఈడీలు పలు దఫాలుగా ప్రశ్నించాయి. ఏపీలో ఎంపీ మాగుంట కుమారుడిని అరెస్టు చేసింది సీబీఐ. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ముందు సీబీఐ తరువాత ఈడీ అరెస్ట్ చేయడంతో జైలులో ఉన్నారు. ఆయనతో పాటు పలువురు ఆప్ నేతలు కూడా ఈ కేసులో జైలులో ఉన్న పరిస్థితి. ఇప్పటికే ఈ కేసులో ఆరు నెలల క్రితం సీబీఐ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సైతం విచారించింది. తాజాగా ఈడీ విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు అందాయి. 


అయితే ఆయన హాజరుకాకపోవడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై ఎవరుంటారు, ఎవరు పాలిస్తారనే ప్రశ్నలకు ఆప్ సమాధానమిచ్చింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తే జైలు నుంచే పాలన సాగించే విధంగా కోర్టు అనుమతి తీసుకుంటామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ప్రకటన చేసింది. కేజ్రీవాల్‌ను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసినా జైలు నుంచే ప్రభుత్వం నడపాలని ఆప్ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్‌కు సూచించారు. 


ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని, అందుకు ఆయనే సీఎంగా ఉండాలని మంత్రి అతిషి తెలిపారు. అవసరమైతే జైలులోనే కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు అనుమతి తీసుకుంటామన్నారు. నవంబర్ 2 ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు.


Also read: Earthquake Today: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం.. భయం గుప్పిట్లో ప్రజలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook