డిప్రెషన్‌తో ప్రమోషన్ ఐఏఎస్ అధికారి ఆత్మహత్య కలకలం
IMA Ponzi స్కామ్‌లో ఇరుక్కుని అరెస్టయ్యారు. కొన్ని రోజుల కిందట సస్పెన్షన్ గడువు ముగిసింది. తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఎంతో ఉత్సాహంగా ఉదయం ఆఫీసుకు వెళ్లిన ఐఏఎస్ సాయంత్రం ఇంటికి తిరిగొచ్చారు. ఏం జరిగిందో తెలియదు కానీ ప్లాస్టిక్ వైర్‌తో ఉరేసుకుని బలవన్మరణం చెందారు.
IAS officer Commits suicide | విచారణ ఎదుర్కొన్న ప్రమోషన్ ఐఏఎస్ అధికారి బీఎం విజయ్ శంకర్(IAS Vijay Shankar) ఆత్మహత్య చేసుకున్నారు. ఐ మానిటరీ అడ్వైజరీ(IMA) పాంజి కేసులో రూ.4 కోట్ల లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో గతంలో Vijay Shankar IAS సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇటీవల తిరిగి బాధ్యతలు చేపట్టిన ఆయన మంగళవారం సాయంత్రం జయనగర్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణం చెందారు. 2001లో కేఏఎస్ అధికారిగా నియమితులైన విజయ్ శంకర్ 2014లో ఐఏఎస్‌గా ప్రమోషన్ పొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వంద శాతం ఫలితాలతో వస్తున్న పతంజలి కరోనా మెడిసిన్ Coronil.. ధరెంతో తెలుసా!
సకల మిషన్(Sakala Mission)లోని అధికారుల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఆయన మిషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం నాడు వీవీ మోటార్స్‌పై జరిగిన సమీక్షా సమావేశంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న విజయ్ శంకర్ సాయంత్రం ఇంటికి వెళ్లిపోయారు. ఏడు గంటలకు గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. ఏడున్నర గంటల ప్రాంతంలో భార్య ఎంత పిలిచినా, తలుపుకొట్టినా ప్రయోజనం లేకపోయింది. కిటికీలోంచి చూసి షాకైంది. ప్లాస్టిక్ వైర్‌తో ఉరివేసుకుని భర్త ఆత్మహత్య చేసుకున్నాడని గమనించిన భార్య పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విజయ్ శంకర్ డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుతపత్రికి తరలించారు. Gold Price: తగ్గిన బంగారం ధర.. అదే దారిలో వెండి
కాగా, గతేడాది జులైలో వెంగలూరు అర్బన్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సమయంలో ఆయన ఏఎంఏ కుంభకోణంలో ఇరుక్కున్నారు. రూ.4 కోట్ల మేర లంచాలు తీసుకున్నారని విజయ్ శంకర్‌ను అరెస్ట్ చేశారు. ఆయనపై పలు అభియోగాలతో ఛార్జిషీటు దాఖలైంది. అప్పటినుంచీ ఆయన డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. కొంత కాలానికి బెయిల్ మీద విడుదలైన విజయ్ శంకర్ సస్పెన్షన్ గడువు ముగియడంతో నెల కిందట సకల మిషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గత కొంతకాలం నుంచి డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్న ప్రమోషన్ ఐఏఎస్ విజయ్ శంకర్ ఈ కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ